హక్కుల వెనుక లాజిక్కు ఇదా?

రామోజీ రావుకు చెందిన ఈటీవీకి బాహుబలి హక్కులు అందుతాయని ఓ టాక్ బయల్దేరింది. అయితే ఇది ఎంతవరకు అన్నది ఆరాతీస్తే, కొన్ని సంగతులు వినిపిస్తున్నాయి. సినిమా హక్కులు రామోజీ అడగలేదు. రాజమౌళినే థాంక్స్ గివెన్…

రామోజీ రావుకు చెందిన ఈటీవీకి బాహుబలి హక్కులు అందుతాయని ఓ టాక్ బయల్దేరింది. అయితే ఇది ఎంతవరకు అన్నది ఆరాతీస్తే, కొన్ని సంగతులు వినిపిస్తున్నాయి. సినిమా హక్కులు రామోజీ అడగలేదు. రాజమౌళినే థాంక్స్ గివెన్ గా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

చాలా అంటే చాలా నామినల్ ఇంట్రెస్ట్ రేటుకు బాహుబలికి రామోజీ తన సంస్థద్వారా చాలా పెద్దమొత్తం ఫైనాన్స్ చేసారు. అది చాలదన్నట్లు..బీభత్సమైన ప్రచారం సాగించారు. చంద్రబాబు, తెలుగుదేశం, మధ్యనిషేధం తరువాత అంతలా ఈనాడు సాగించిన ప్రచారం బాహుబలే. ఆ సినిమా విజయంలో ఈ పాత్రను విస్మరించలేరు ఎవరూ. అందుకే బయటవాళ్లు ఆఫర్ చేసిన 12 కోట్లకు కాస్త అటు ఇటుగానే ఈటీవీకి కావాలంటే ఇస్తానని రాజమౌళినే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే కోట్లకు కోట్ల పెట్టి ఈటీవీ ఎప్పుడూ పోటీ పడి సినిమాలు కొనలేదు. అందువల్ల ఇప్పుడు కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారట. అయితే త్వరలో ప్రారంభించబోయే ఈటీవీ మూవీస్ చానెల్ కు ఇది మంచి బోణీ, మంచి ప్రచారం ఇస్తుందని కూడా ఆలోచిస్తున్నారట. అదీ సంగతి. అక్కడ ఆగింది అమ్మకం.