కమెడియణ్స్ అనగానే ఎంతో కొంత బూతు మీద ఆధారపడక తప్పదు. కమెడియన్ అలీ అయితే బూతుని పరాకాష్టకు తీసుకెళ్ళి కప్‌లింగ్ మే దడ్ దడ్‌మనిపిస్తాడు. నీ పాంథర్ పగిడి అని హీరోయిన్స్‌ని ఏడిపిస్తుంటాడు. కాట్రవల్లి అని ముద్దుగా పిలిపించుకునే అలీ సినిమాల్లోగానీ, స్టేజ్ ప్రోగ్రామ్స్‌గానీ టీవీ షోలుగానీ చూసినవాళ్ళకి అతని బిహేవియర్ ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది.
అతని పక్కన నటించే ఫిమేల్ ఆర్టిస్టులు హర్ట్ అవకుండా వుండటం కష్టం. ఈ మధ్యన విజయవాడలో జరిగిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఆడియో ఫంక్షన్‌లో హీరోయిన్ సమంత అక్కడ లేకపోయినా ఆవిడ పోస్టర్‌లోని బొడ్డుని చూపిస్తూ, నాకు ఈ ప్రాంతం అంటే ఇష్టం.. ఇది బెంజ్ సర్కిల్‌లా వుంటుంది. అనడంతో జనం ఘొల్లున నవ్వేశారుగానీ, అది ఎంత వల్గర్ పంచో తెలిసినవాళ్ళు మాత్రం అలీ నోటి దురద గురించి ఇంకోరకంగా మాట్లాడుకున్నారట. ఎదిగే కొద్దీ ఆయనలో ఆ దురద తగ్గకపోవడం విశేషం.