Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

మహేష్ టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్

మహేష్ టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్

మురగదాస్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన సినిమా టీజర్ కూడా ప్రత్యేకంగా వుంటుంది. కావాలంటే కత్తి టీజర్ ఓ సారి యూ ట్యూబ్ లో చూడండి. అది చూసాక మన తెలుగురీమేక్ ఖైదీ 150 టీజర్ చూడండి.. స్పష్టంగా తెలుస్తుంది. ఇంటలెక్చ్యువల్ వ్యవహారానికి, సాదాసీదా టేకింగ్ కు తేడా. 

విషయానికి వస్తే, మహేష్ సినిమా టీజర్ కు ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారు మురగదాస్. అకీరా విడుదల బిజీలో వున్నారు. ఇది కాగానే ఫస్ట్ వీక్ లో చెన్నయ్ లో మళ్లీ మహేష్ షూట్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే టీజర్ విడుదల కూడా వుంటుంది. ఈ టీజర్ తయారీకి అచ్చంగా ఓ రోజు షూట్ చేయాలని మురుగదాస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 ఆయన ఓ కాన్సెప్ట్ అనుకున్నారు. దాని మేరకు ప్రత్యేకంగా షూట్ చేస్తారు. కాస్త గ్రాఫిక్స్ మిక్స్ తో వుండే అవకాశం వుంది. 40 నుంచి 50 సెకెండ్ల పాటు వుండే ఈ టీజర్ టైటిల్ పడడంతో ముగుస్తుంది. దీన్ని డిఫరెంట్ గా చేయాలని వన్ డే మొత్తం షూట్ పెట్టుకున్నారట మురగదాస్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?