బాలీవుడ్‌లో ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోకుండానే 'కాపురాలు' పెట్టేయడం మామూలే. కత్రినాకైఫ్ – రణ్‌బీర్ కపూర్ జంట ఈ విషయంలో పెద్ద సెన్సేషనే సృష్టించేసింది. అంతకు ముందు, బిపాసా బసు – జాన్ అబ్రహామ్ ఇదే కోవలో హల్‌చల్ చేశారు. ఆ మాటకొస్తే షాహిద్ కపూర్ – ప్రియాంకా చోప్రాదీ అదే తీరు. చెప్పుకుండూ పోతే లిస్ట్ చాంతాడంత వుంటుంది. 'అయినా, ఇదంతా బాలీవుడ్‌లో కామన్' అని సరిపెట్టుకోవాలంతే.
తాజాగా, ఈ లిస్ట్‌లోకి శ్రద్ధా కపూర్ – ఫర్హాన్ అక్తర్ చేరిపోయారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఇటీవలే ఫర్హాన్ అక్తర్ కొత్త ఫ్లాట్ కొనుక్కున్నాడు. అందులో ఫర్హాన్ – శ్రద్ధా 'కాపురం' పెట్టేస్తున్నారంటూ బాలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, షరామామూలుగానే ఈ గాసిప్స్‌ని శ్రద్ధా కపూర్ కొట్టి పారేసింది.
'నేను ఇంట్లో చెప్పకుండా ఏ పనీ చెయ్యను.. ఇంట్లో వాళ్ళ అనుమతి తప్పకుండా తీసుకుంటాను..' అంటూ లెక్చర్లు దంచేస్తోంది శ్రద్ధా కపూర్. ఫర్హాన్ తన స్నేహితుడన్నమాట వాస్తవమేగానీ, సహజీవనం చేసేంత అండర్‌స్టాండింగ్ తమ వద్ద ఇంకా రాలేదని చెబుతోందీ ముద్దుగుమ్మ. ఏమో, పైకి చెప్పే మాటలకీ తెరవెనుక చేసే పనులకీ పొంతనేమన్నా వుంటుందా.? శ్రద్ధా కపూర్ కుటుంబ సభ్యులే ఆమె తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, మేటర్ చాలా సీరియస్ అనే కదా అర్థం.!