మంచి పాత్రలు చేసుకుంటూ పోతే తన అందాలు చూపించడానికి హీరోయిన్‌కి ఛాన్స్ వుండదు. డర్టీ పిక్చర్ చేసినప్పుడే విద్యాబాలన్‌లో ఇంత వుందా.? అని జనం నోరెళ్ళబెట్టారు. ఇప్పుడు అదే ఫార్ములాతో నిన్నటి హీరోయిన్ ఛార్మి మళ్ళీ తెరపై కనిపించనుందట.
‘జ్యోతిలక్ష్మి’ పేరుతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే ఆ సినిమా మంచి మసాలాతో నషాళానికి అంటేలా రూపొందించనున్నారట. ఆ పాత్రలో ఛార్మి ఒక్కతే ఇమడగలదనీ, చూపించదగ్గ టాలెంట్ కూడా ఆమెకే వుందని పూరి బల్లగుద్ది చెబుతున్నాడు.
ఇక ఛార్మి అయితే ‘మహా మహా’ అంటూ తన నడుముని ఇష్టమొచ్చినట్లు ఊపేసేందుకు ‘జ్యోతిలక్ష్మి’ సినిమానే గొప్ప వేదిక అని భావిస్తుందట. జ్యోతిలక్ష్మి క్లబ్ డాన్సర్‌గా బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి కలర్ సినిమాల వరకూ ఊపేసింది. ఆమె సోదరి జయమాలిని కూడా అక్క పేరుని క్యాష్ చేసుకుంది.
జయమాలిని, జ్యోతిలక్ష్మి అనే పేర్లని ఆడపిల్లలకు పెట్టడానికి తెలుగు జనం ఇప్పటికీ కాస్తంత సంశయిస్తారు. వాళ్ళ డాన్సులు అలా వుండేవి మరి. అలాంటి జ్యోతిలక్ష్మి పాత్రలో ఛార్మి ఇరగదీసి, ఉతికి ఆరేస్తుందని పూరి జగన్నాథ్ నమ్మకం. చూద్దాం. ఆంటీ వయసుకు దగ్గరవుతున్న ఛార్మి ఎలా అలరిస్తుందో.!