నాగచైతన్య కొత్త సినిమా ప్రకటన వెలువడింది. స్వామిరారా వంటి వైవిధ్యమైన సినిమా అందించిన సునీల్ వర్మ దర్శకుడు. ఇప్పటికే కొండా విజయకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా సిద్ధమవుతోంది. అంతాబాగానే వుంది. కానీ పాపం, వీరిద్దిరి కన్నా ముందుగా నాగచైతన్యనను నమ్ముకుని కూర్చున్న శ్రీనివాసరెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది.
హాయిగా చిన్న సినిమాలు చేసుకుంటూ వుండే శ్రీనివాసరెడ్డిని ఢమరుకం సినిమాతో పెద్ద దర్శకుల జాబితాలోకి చేర్చేసారు. అది పెద్దగా ఆడకపోయినా, నాగచైతన్యతో మరో సినిమా చేద్దామని ఊరడించారు. హలోబ్రదర్ రీమేక అన్నారు. గడచిన రెండేళ్లుగా ఆయన అలా అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ ఫలితం లేదు.
ఇప్పుడు ఇక అసలే లేదని స్పష్టమైపోతోంది. ఎందుకంటే నాగచైతన్య తన చేతిలో వున్న రెండు సినిమాలు పూర్తి చేసే సరికి 2014 గడిచిపోవచ్చు. అంతట్లో మరో హిట్ కొట్టిన కొత్త దర్శకుడు ఎవరైనా లైన్ లోకి రావచ్చు. శ్రినివాసరెడ్డి ఏదో ఒక దారి చూసుకొవడం ఉత్తమమేమో?