Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నైజాంలో మహేష్ రికార్డు

నైజాంలో మహేష్ రికార్డు

అనుకున్నట్లుగానే మహర్షి సినిమా రికార్డులు సృష్టిస్తోంది. సినిమా ఎలావున్నా, డివైడ్ టాక్ వున్నా, మిగిలిన విషయాలు అన్నీ ఎలా వున్నా, తొలిరోజు మాత్రం అన్నిచోట్లా మంచి ఫలితాలు నమోదు చేసినట్లు వార్తలు అందుతున్నాయి. విపరీతమైన డిమాండ్ తో భయంకరంగా షోలు వేయడం, అలాగే రేట్ల పెంపు వంటి అంశాలు కలిసి వచ్చాయి. నైజాంలో తొలిరోజు ఏకంగా ఆరుకోట్లు ముఫై ఎనిమిది లక్షలకు పైగా షేర్ ను సాధించింది. తొలిసారి నైజాంలో మల్టీ ఫ్లెక్స్ ల్లో రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే.

దీంతో నాన్ బాహుబలి రికార్డు మహర్షి స్వంతమైంది. బాహుబలి వన్ 6.28 కోట్లు వసూలు చేస్తే, మహర్షి తొలిరోజు మరో పదిలక్షలు అదనంగా వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక మీదన వున్న ఫస్ట్ డే రికార్డు బాహుబలి టూ ఒక్కటే.

ఇదిలావుంటే తొలిరోజు నెల్లూరులో కోటి ఏడులక్షలు వసూలు చేసింది. అలాగే గుంటూరులో 4.40 కోట్లు, వెస్ట్ లో 2.47, ఈస్ట్ లో 3.20 కోట్లు, సీడెడ్ లో 2.90 కోట్లు వసూలు చేసింది. మిగిలిన ఏరియాల వివరాలు ఇంకా రావాల్సి వుంది. 

బాలకృష్ణ..ఎమ్మెల్యేగా గెలవాలంటే అదే జరిగుండాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?