ఓజీ సినిమా కేరాఫ్ జనసేన!

ఓజీ సినిమా కోసం.. జనసేన జనాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సినిమా తమకు కావాలని వారు గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు

పవన్ ‘ఓజీ’ సినిమా క్రేజ్ మామూలుగా లేదు, దేవర హిట్ కు ముందు ఓన్లీ ఏపీ (సీడెడ్ కాకుండా) 55 కోట్ల రేషియోలో విక్రయించాలని అనుకున్నారు. ఇప్పుడు అది 70 కోట్లకు చేరిపోయింది.

గమ్మత్తేమిటంటే ఏపీలో విశాఖ, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు, గుంటూరు, కృష్ణా ఏరియాలు అన్నింటా రెగ్యులర్ బయ్యర్లు వున్నారు. వాళ్లు 70 కోట్ల రేషియోలో అయినా ఆసక్తిగానే వున్నారు. కానీ అదే టైమ్ లో జనసేన జనాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సినిమా తమకు కావాలని వారు గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంటే నిర్మాత దానయ్య పంట పండినట్లే అనుకోవాలి.

ఏపీ పరిస్థితి ఇలా వుంటే నైజాం ఏరియాకు 46 కోట్లు ఇన్ క్లూడింగ్ జీఎస్టీ లెక్కన ఇచ్చేస్తున్నారు. ఇక సీడెడ్ మిగిలి వుంది, అదో ముఫై కోట్ల వరకు వుంటుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దగ్గర దగ్గర 150 కోట్ల వ్యాపారం అన్నమాట. దేవర కన్నా ఇది 30 కోట్లు ఎక్కువ. సుజిత్ దర్శకుడిగా ఓజీ ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమా కు క్రేజ్ పెరుగుతూనే వుంది. దేవర వసూళ్లు చూసారు. పవన్ సినిమా కనుక రేట్లు, షో లు సమస్య ఏమీ వుండదు. పైగా ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు.

ఇదిలా వుంటే గతంలోనే మార్చి 2025 విడుదల అని ఓజీ సినిమా యూనిట్ నుంచి పోస్టర్ వచ్చింది. కానీ తరువాత అలాంటి పోస్టర్ నే హరి హర వీరమల్లు నుంచి వచ్చింది. ఏ సినిమా మార్చిలో వస్తుంది అన్నది క్వశ్చను. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఓజీనే ముందుగా వస్తుందని తెలుస్తోంది.

11 Replies to “ఓజీ సినిమా కేరాఫ్ జనసేన!”

    1. వృత్తి ధర్మం అనేది ఒకటి ఉంటుంది.

      దాని గురించి నీకు, ఏ పని పాట చేయని నీ నాయకుడికి తెలియక పోవచ్చు.

      రాజ్యాంగం ప్రకారం సినిమాల్లో నటించడం తప్పుకాదు.

      కానీ అదే రాజ్యాంగం ప్రకారం అక్రమ ఆస్తులు సంపాదించడం నంరం

Comments are closed.