నేనొక్కడినే (వన్) సెన్సారు శనివారం రాత్రి జరిగిందని, యు/ఎ సర్టిఫికెట్ వార్తలు వినవచ్చాయి. అయితే అది వాయిదా పడిందని విశ్వసనీయంగా తెలిసింది. సెన్సారు అధికారిణి, ఆలస్యం అయిపోయిందన్న కారణంగా నిన్న సినిమా చూసేందుకు అంగీకరించలేదని తెలిసింది.
దాంతో సినిమా సెన్సారు కార్యక్రమం వాయిదా పడిందని తెలిసింది. బహుశా ఆమె అంగీకరిస్తే ఈ రోజు లేకుంటే సోమవారం జరగచ్చు. నిజానికి వన్ సెన్సారు 6న జరుగుతుందని ముందునుంచీ అనుకుంటున్నదే. అయితే పనులు అయిపోవడంతో శనివారమే సెన్సారు కానిచ్చేస్తే రెండురోజులు కలిసి వస్తాయని యూనిట్ భావించినట్లు తెలిసింది.
అయితే కానీ సోమవారానికే అది ఫిక్సయినట్ల కనిపిస్తోంది. అయినా కూడా ఫరవాలేదు. అక్కడికి ఇంకా మూడు రోజులు సమయం వుంటుంది. సెన్సారు అనంతర కార్యక్రమాలకు. ఇదిలా వుంటే నేనొక్కడే సినిమా క్రేజ్ మాత్రం ఆకాశానికి అంటేస్తోంది. ఒక్క రాజధాని నగరంలోనే 110 థియేటర్లలో 685 షో లు తొలి రోజు ప్రదర్శించనున్నట్లు వార్తలు గుప్పు మన్నాయి.