చిత్రసీమలో ప్రతిభ కంటే… విజయాలే కీలకం. అప్పటి వరకూ 'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అంటూ బతిమాలిన వాళ్లంతా.. హిట్టు చేతికి అందగానే రేటు అమాంతం పెంచేస్తారు. పారితోషికంలో రిబేటు కూడా ఇవ్వరు. ప్రస్తుతం సందీప్‌కిషన్ పరిస్థితి ఇంతే.
చిత్రసీమలో అడుగుపెట్టి నాలుగేళ్లు అయినా.. ఒక్క హిట్ కూడా దక్కించుకోలేకపోయాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో ఆ విజయాన్ని రుచి చూశాడు సందీప్. దాంతో నిర్మాతల తాకిడి ఈ అబ్బాయికి ఎక్కువైంది. ఇక ఆగుతాడా..?? అమాంతం రేటు పెంచేశాడు. ఇది వరకు పది లక్షలకూ సినిమాలు ఒప్పుకొన్న సందీప్ ఇప్పుడు అమాంతంగా కోటి అడుగుతున్నాడట. శాటిలైట్ రేట్స్ నాపేర రాస్తే చేస్తా.. అంటూ షరతులు విధిస్తున్నాడట.
అంతేకాదు.. కథ విషయంలో నాదే అంతిమ తీర్పు, దర్శకుడు నేను చెప్పినట్టు చేయాలి.. అంటూ చాంతాడంత డిమాండుల లిస్టు తీస్తున్నాడట. దాంతో వామ్మో.. అంటూ నోరెళ్లబెడుతున్నారు నిర్మాతలు. హిట్టొస్తే అంతేమరి..!