పూరి-చిరు సినిమా క్యాన్సిల్?

చిరంజీవి-పూరి జగన్నాధ్ సినిమా వుంటుందా..వుండదా? ఇదీ ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ వార్త ఇది. గడచిన రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఏస్ డైరక్టర్ వివి వినాయక్ తో సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు. బహుశా…

చిరంజీవి-పూరి జగన్నాధ్ సినిమా వుంటుందా..వుండదా? ఇదీ ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ వార్త ఇది. గడచిన రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఏస్ డైరక్టర్ వివి వినాయక్ తో సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు. బహుశా అవి ఒక కొలిక్కి రాగానే రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం ప్రకటించే అవకాశం వుంది. 

పూరి-నితిన్ సినిమా క్యాన్సిల్ కావడం, ఆ వెంటనే వరుణ్ తేజ సినిమా ప్రకటించినపుడే జనాలకు అనుమానం వచ్చింది. మెగాస్టార్ సినిమా ముందు పెట్టుకుని, వరుణ్ తేజ సినిమాకు క్లాప్ కొట్టడం ఏమిటా? అని. జ్యోతిలక్ష్మి లాంటి సినిమా చేసిన తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయడం అంటే అంత బాగుండదు. 

టెంపర్ తరవాత ఆ ఫ్లావర్ అలా వుండగానే చిరు సినిమా చేస్తే అది వేరేగా వుంటుంది. అందుకే ఇవన్నీ ఆలోచించి,మెగాస్టార్ తన నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నారని వినికిడి. వినాయక్ తో కథా చర్చలు సీరియస్ గా జరుగుతున్నాయి. పూరి ప్రస్తావన మెగా కాంపౌండ్ లో వినిపించడం లేదు. మరి అసలు విషయం ఎప్పుడు బయటకు వస్తుందో మరి.