రాజా రవీంద్ర చాన్స్ మిస్సయ్యాడు

రాజా రవీంద్ర..హీరోగా మొదలు పెట్టి, చిన్న చిన్న క్యారెక్టర్లకు సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఉన్నట్లుండి ఫుల్ లెంగ్త్ అదీ హీరోయిన్ తండ్రిగా మంచి అవకాశం వచ్చింది. సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు సినిమాలో. కానీ పాపం,…

రాజా రవీంద్ర..హీరోగా మొదలు పెట్టి, చిన్న చిన్న క్యారెక్టర్లకు సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఉన్నట్లుండి ఫుల్ లెంగ్త్ అదీ హీరోయిన్ తండ్రిగా మంచి అవకాశం వచ్చింది. సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు సినిమాలో. కానీ పాపం, డైరక్టర్ కు స్టామినా సరిపోలేదు..ఆ పాత్ర పండలేదు. 

అదే కృష్ణవంశీ లాంటి డైరక్టర్ అయితే రాజా రవీంద్రను కూడా ఓ చలపతిరావు బాబాయ్ లాగానో, ఆహుతి ప్రసాద్ లాగానో మార్చేసి వుండేవాడు. రాజా రవీంద్ర కెరీర్ ఝామ్మున టర్నింగ్ ఇచ్చుకునేది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో పాత్ర పండలేదు. అలా జరగలేదు. ఇకనైనా కాస్త పెద్ద డైరక్టర్ సినిమాలో ఇలాంటి రోల్ సంపాదిస్తే, అనుకున్నట్లు టర్నింగ్ ఇచ్చుకుంటుంది. లేదూ అంటే ఇలా చిన్న చిన్న వేషాలతోనే కాలం గడిపేయాల్సి వస్తుంది.