Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్-బాలయ్యను ఢీ కొనడం లేదు

రామ్-బాలయ్యను ఢీ కొనడం లేదు

రామ్ పండగ చేస్కో మే 15న రావడం లేదు. 22న లేదా 29న విడుదల చేయాలని యూనిట్ ఆలోచిస్తోంది. లయన్ సినిమా 8 నుంచి 15 కు వెళ్లినపుడే పండగ చేస్కో మీద అనుమానం వచ్చింది. వస్తుందా..వాయిదా పడుతుందా అని. 

అయితే బాబాయ్ బాలయ్య సినిమా అయిన వారానికో, రెండు వారాలకో రావాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్..తన కిక్ 2 తో. ఇప్పుడు అడియో ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. బాలయ్య లయన్ సినిమా హిట్ అనిపించుకుంటే, రెండు వారాలు గ్యాప్ ఇచ్చికానీ కిక్ 2 వదలడు. 

లేదూ అంటే మళ్లీ 22న లేదా 29న అంటే పండగ చేస్కోకు పోటీ ఎదురయ్యే అవకాశం వుంది. ఇంక సమ్మర్ సీజన్ కు వున్నవి ఈ రెండు తేదీలే. వీటి కోసం చాలా సినిమాలు వేచి వున్నాయి. కాదూ అంటే ఇక మిగిలింది జూన్ ఫస్ట్ వీక్ మాత్రమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?