cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

శేఖర్‌ కమ్ముల కాన్ఫిడెన్స్‌ కోల్పోయాడా?

శేఖర్‌ కమ్ముల కాన్ఫిడెన్స్‌ కోల్పోయాడా?

కొత్తవాళ్లతో సినిమాలు తీసి భారీ విజయాలు సాధించడం శేఖర్‌ కమ్ముల స్టయిల్‌. అతనితో పని చేయాలని మహేష్‌ బాబు లాంటి హీరోలు ఆసక్తి చూపించినా కానీ అతను మాత్రం కొత్తవాళ్లతో సినిమాలకే కట్టుబడ్డాడు. 'ఫిదా' చిత్రానికి కూడా సాయిపల్లవి తెలుగు ఇండస్ట్రీకి కొత్తే. వరుణ్‌ తేజ్‌కి కూడా అప్పటికి అంత పేరేమీ లేదు. కొత్త వాళ్లతో చేయడం కంఫర్టబుల్‌గా ఫీలయ్యే శేఖర్‌ కమ్ముల 'ఫిదా' తర్వాత కూడా కొత్తవాళ్లతోనే సినిమా మొదలు పెట్టాడు.

యాభై శాతానికి పైగా షూటింగ్‌ అయిపోయిన తర్వాత సినిమా చూసుకున్న శేఖర్‌ కమ్ములకి అది అనుకున్నట్టుగా రావడం లేదనిపించి మొత్తంగా ఆ చిత్రాన్నే స్క్రాప్‌ చేసేసాడు. దానికి బదులుగా నాగచైతన్యతో మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అయితే శేఖర్‌ కమ్ములకి దీని వల్ల వచ్చిన నష్టమేమీ వుండదు. అలాగే నిర్మాతకి వచ్చిన నష్టం కూడా మరో సినిమాలో కవర్‌ చేసుకోవచ్చు.

అయితే ఈ చిత్రంతో అవకాశం దక్కించుకుని, భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ నటీనటుల మాటేమిటి? మళ్లీ వాళ్లకి ఇలాంటి అవకాశం వచ్చేదెప్పటికి? కొత్త వాళ్లతో సినిమాలు తీసే కాన్ఫిడెన్స్‌, కరేజ్‌ వున్న దర్శకులే అరుదు. అలాంటిది శేఖర్‌ కమ్ముల లాంటి దర్శకులు కూడా కొత్తవారితో సినిమా తీయలేమని చేతులెత్తేస్తే వాళ్లతో చేసేదెవరు? మళ్లీ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని తీసుకొచ్చేదెవరు?

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'