సింగిల్స్ తో సందడి చేయబోతున్న స్పైడర్

మొన్నటివరకు ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూశారు ఆడియన్స్. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలకానున్న టీజర్ ఎలా ఉంటుందా అంటూ చర్చించుకున్నారు. కానీ అంతకంటే ముందే సందడి షూరూ చేశాడు మహేష్. టీజర్ కంటే…

మొన్నటివరకు ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూశారు ఆడియన్స్. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలకానున్న టీజర్ ఎలా ఉంటుందా అంటూ చర్చించుకున్నారు. కానీ అంతకంటే ముందే సందడి షూరూ చేశాడు మహేష్. టీజర్ కంటే ముందే పాటలతో హల్ చల్ చేయబోతున్నాడు.

స్పైడర్ సినిమాకు సంబంధించి ఆగస్టు రెండో తేదీ సాయంత్రం 6 గంటలకు ఓ సాంగ్ విడుదల చేయబోతున్నారు. బూమ్ బూమ్ అనే లిరిక్స్ తో ఈ పాట సాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 ఫ్రేమ్స్ తో ఓ టీజర్ కూడా విడుదల చేశారు. ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ సాంగ్ విడుదలతో పాటు దాని మేకింగ్ కూడా రాబోతోంది. 

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి పాటను షూట్ చేయబోతున్నారు. సినిమాను సెప్టెంబర్ 27న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.