బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చడంలో దిట్ట తాప్సి. ఏ ఇండస్ట్రీకి వెళితే… అక్కడ ఓ హీరోతో ప్రేమాయణం సాగిస్తుంటుంది. వార్తల్లోకి ఎక్కుతుంటుంది. ఇప్పటికే అమ్మడి బుట్టలో పడి గిల గిలా కొట్టుకొన్న కథానాయకులు ఎంతోమంది ఉన్నారు. తెలుగులో మంచు మనోజ్ అన్నారు. ఆ తర్వాత తమిళంలోకి వెళ్లింది. అక్కడైతే ముగ్గురు నలుగుర్ని మార్చింది. మహత్ రాఘవేంద్ర, ఆది పినిశెట్టి, ఆర్య, చివరికి శింబుతో కూడా కొన్ని రోజులు క్లోజ్‌గా మూవ్ అయిందని అంటుంటారు. ఇప్పుడేమో తమిళం వదిలిపెట్టి ముంబై వెళ్లిపోయింది.
అక్కడ సినిమా అవకాశాలకోసం ట్రై చేస్తోంది. మరి అక్కడ బాయ్‌ఫ్రెండ్ లేకపోతే ఎలా? అందుకే… హీరోలతో క్లోజ్‌గా మూవ్ అవుదామని చాలా ట్రై చేసింది. కానీ ఎవ్వరూ అమ్మడితో రాసుకుపూసుకు తిరగడానికి ముందుకు రాలేదు. దీంతో తాప్సి ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ని బుట్టలో వేసుకొందట. ఓ పార్టీలో కలిసిన మథియస్‌తో పరిచయం పెంచుకొందట. అమ్మడి మూతి ముడుపులను చూసి మనోడు పడిపోయాడట.
అంతటితో ఊర్కోకుండా… `మై బ్యూటిఫుల్ గర్ల్‌ఫ్రెండ్ తాప్సి` అని ట్వీట్ చేశాడట. అంతే… అప్పట్నుంచి వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్… అంటూ ప్రచారం సాగుతోంది. మథియస్ మ్యాచ్‌లకు కూడా తాప్సి హాజరవుతోందట. ప్రియుడు పాయింట్స్ సాధించినప్పుడంతా ఎగిరి గంతేస్తోందట. `బాబూ మథియస్… తాప్సిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు, బాలీవుడ్‌లో మంచి హీరో దొరికితే నీకు టాటా చెప్పేసి వెళుతుంది జాగ్రత్త` అంటున్నారు ఆమె గురించి తెలుసినవాళ్లు.