Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వంగా చూపు వేరే హీరో వైపు?

వంగా చూపు వేరే హీరో వైపు?

సందీప్ వంగా... అర్జున్ రెడ్డి సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. అంతేకాదు, అంత వేగంగానూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసాడు. అయితే టాలీవుడ్ హిట్ బాలీవుడ్ ఎంట్రీకి మధ్యలో తెలుగులో మహేష్ బాబుతో సినిమా అన్నమాట ఒకటి వినిపించింది. రెండు నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. బాలీవుడ్ సినిమా తరువాత మహేష్ తో సినిమా వుంటుందని వినిపించింది.

అయితే ఈలోగా సందీప్ వంగా ఓ లైన్ చెప్పాడని, అది నచ్చలేదని, మరో లైన్ చెప్తాడని ఇలా వార్తలు కమ్ గ్యాసిప్ లు వినిపించాయి. ఇప్పుడు టైమ్ వచ్చింది. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్ విడుదలకు రెడీ అయింది. సందీప్ వంగా ఫ్రీ అయినట్లే.

కానీ ఇక్కడ మహేష్ బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలు కమిట్ అయిపోయాడు. అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి సినిమాలు చేయాలి. సుకుమార్ సినిమా మాట ఒకటి వుంది. అంటే సందీప్ వంగా కనీసం వచ్చే సమ్మర్ వరకు వెయిట్ చేయాలి. మరి అలా వెయిట్ చేస్తాడ? మరే హీరోతో అయినా సినిమా చేస్తాడా? అన్నది అనుమానం.

విజయ్ దేవరకొండతోనే మరో సినిమా చేసే అవకాశం వుందని వినిపిస్తోంది. విజయ్-వంగా కాంబినేషన్ అంటే ఆసక్తి మళ్లీ ఓ రేంజ్ లో వుంటుంది. కానీ విజయ్ కూడా బిజీగానే వున్నాడు. ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి?

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?