cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ హీరోయిన్లకు ఎందుకింత పిచ్చి?

ఈ హీరోయిన్లకు ఎందుకింత పిచ్చి?

నెగ్గుకురాలేం అని తెలుసు. ఓ హిట్ వచ్చినా కొనసాగలేం అని కూడా తెలుసు. కానీ ఎందుకో హీరోయిన్లంతా బాలీవుడ్ వైపు ఆశగా చూస్తుంటారు. కళ్ల ముందు ఉన్న క్రేజ్ ను తన్నేసుకొని మరీ హిందీ ఆఫర్ వస్తే చాలు చటుక్కున చెక్కేస్తుంటారు. 2 ఫ్లాపులు తగిలిన తర్వాత కానీ వాళ్లకు అసలు విషయం అర్థంకాదు. అప్పటికే జరగాల్సిన డామేజీ జరిగిపోతుంది. ఇటు సౌత్ లో కూడా క్రేజ్ తగ్గిపోతుంది. 

ఇలియానా, తమన్న, అసిన్, శ్రియ, జెనీలియా.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ కు వెళ్లి చేతులు కాల్చుకున్న ముద్దుగుమ్మల బ్యాచ్ చాలా పెద్దది. ఇన్ని అనుభవాలు కళ్లముందు పెట్టుకొని కూడా ఇప్పుడు పూజా హెగ్డే ఈ బ్యాచ్ లో చేరేందుకు తహతహలాడుతోంది. 

నిజానికి పూజాహెగ్డేకు బాలీవుడ్ కొత్తకాదు. అక్కడ ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాతే సౌత్ కు వచ్చింది. ఇప్పుడిక్కడ ఆమె పెద్ద హీరోయిన్. ఇలాంటి టైమ్ లో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేయకుండా మరో హిందీ ఆఫర్ వచ్చిందంటూ అక్కడికెళ్తోంది పూజా. అది కూడా స్టార్ హీరో ఆఫర్ కాదు. ఇంకా చెప్పాలంటే ఓ బి-గ్రేడ్ సినిమా. 

తెలుగులో ఆమె కాల్షీట్ల కోసం స్టార్ హీరోలంతా వెయిటింగ్. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ సినిమాకు ఆమె ఓకే చెప్పడం కెరీర్ ను నాశనం చేసుకోవడమే అంటున్నారు క్రిటిక్స్. అంతెందుకు శృతిహాసన్ విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న టైమ్ లో బాలీవుడ్ కు వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు సౌత్ లో మళ్లీ సినిమా ఆఫర్ల కోసం వెయిటింగ్. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ లో జెనీలియా, శ్రియ, అసిన్ లాంటి ఎంతోమంది భామలు కళ్లముందు కనిపిస్తారు. వీళ్లంతా సౌత్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన వాళ్లే. బాలీవుడ్ అనే దూరపుకొండను చూసి మోసపోయారు. సౌత్ కు పూర్తిగా దూరమయ్యారు. బాలీవుడ్ లో చేసిన 2,3 సినిమాలతో వీళ్ల కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది.

నిజానికి బాలీవుడ్ అనేది ఓ స్టేటస్. బాలీవుడ్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంటే ఆ కిక్కే వేరు. జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చు. కానీ కేవలం ఒక సినిమాకు ఆశపడి, వచ్చిన చిన్న చిన్న ఆఫర్లు ఒప్పుకొని రెంటికి చెడ్డ రేవడిగా మారుతున్నారు హీరోయిన్లు. శ్రీదేవి, జయప్రద, విద్యాబాలన్ లాంటి కొంతమంది హీరోయిన్లకు మాత్రమే బాలీవుడ్ కలిసొచ్చింది. మిగతా 90 శాతం హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకున్నారు.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే