ప్రతి సినిమాకు ఓ ఎపిసోడ్ ఉంది. అది సినిమాను నిలబెడుతుందని మేకర్స్ గట్టిగా ఫీల్ అవుతుంటారు. ఉదాహరణకు పుష్ప-2 సినిమానే తీసుకుంటే, ఇందులో జాతర ఎపిసోడ్ క్లిక్ అవుతుందని మేకర్స్ భావించారు. ఎంతలా అంటే, ప్రచారాన్ని కూడా దానిచుట్టే తిప్పారు. వాళ్ల నమ్మకం నిజమైంది.
ఇప్పుడలాంటి నమ్మకమే గేమ్ ఛేంజర్ మేకర్స్ లో కూడా కనిపిస్తోంది. వీళ్లు కూడా ఓ ఎపిసోడ్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.
గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. అది సినిమాను నిలబెడుతుందనేది అందరి నమ్మకం. దర్శకుడు శంకర్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నిర్మాత దిల్ రాజు.. ఇలా ఎవ్వర్ని కదిపినా దీని గురించే మాట్లాడుతున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటించాడు. మెయిన్ స్టోరీ కూడా ఇదే. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో పాత్ర ఉంది. రామ్ చరణ్ పోషించిన అప్పన్న క్యారెక్టర్ అది. సినిమా మొత్తానికి అప్పన్న ఎపిసోడ్ హైలెట్ అవుతుందంటున్నారంతా.
పుష్ప-2లో జాతర ఎపిసోడ్ టైపులో, గేమ్ ఛేంజర్ లోని అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హిట్టయితే సినిమాకు ఇక తిరుగుండదని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతోంది గేమ్ ఛేంజర్.
OTT లో చూద్దాం లే
All the best Frome NTR fans’
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటే ఒక జెంటిల్మన్, ఒక మగధీర, ఒక అపరిచితుడు లాంటివి ఉంటె బాగుంటుంది.
పోయి పోయి అజ్ఞాత వాసి, ఆంధ్రావాలా లాంటి ఫ్లాష్ బ్యాకులు ఉంటె ఇక అంతే సంగతులు
There is another episode called Allu Army.
How about ALLU ARMY .
Super 👍 All the best for game changer team
Songs are super 👌
ante oka episode kosam 1k petti pushpa chudali,now idi chudali..
movie ante total kakuna kanisam 2hrs manchiga undali anthi kani 3hrs movie lo 20 min bagundi ade chudandi antam enduku,dani badulu short film tiyochuga karchu taguthadi