మొన్నటివరకు ఒకే సినిమా చేశాడు ఎన్టీఆర్. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా కోసం చాలా టైమ్ కేటాయించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో దేవర సినిమాకు కాస్త విరామం ఇచ్చి వార్-2 సినిమా సెట్స్ పైకి వెళ్లాడు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే రూటు ఫాలో అవ్వబోతున్నాడు.
ఎన్టీఆర్ లానే బన్నీ కూడా పుష్ప-2పై చాలా టైమ్ పెట్టాడు. ఇప్పుడు ఈ హీరో కూడా ఒకేసారి 2 ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ అయ్యాడు.
పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే అట్లీ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతాడు అల్లు అర్జున్. పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ ప్రకటన కాస్త ఆలస్యమైంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.
అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సినిమా పని మీదే ఉన్నాడు. ఆల్రెడీ హీరో-దర్శకుడి మధ్య మీటింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో మొదలవుతుంది.
సో.. పుష్ప-2 సినిమా కొలిక్కి వచ్చినా రాకపోయినా, బన్నీ మాత్రం తన కొత్త ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మేకోవర్ సమస్యలు లేకపోతే 2 సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు బన్నీ.