Advertisement

Advertisement


Home > Movies - Movie News

బలగం.. ఫ్యామిలీ స్టార్.. దిల్ రాజు

బలగం.. ఫ్యామిలీ స్టార్.. దిల్ రాజు

హిట్ అయితే మన ప్రతిభ.. ఫ్లాప్ అయితే ఎవరిదో కుట్ర అని అనుకోవడం, తమను తాము భ్రమలో వుంచుకుని, ఫ్లాపును కవర్ చేసుకోవడం తప్ప వేరు కాదు. సినిమా నిజంగా బాగుంటే, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది ఎంతలా అడ్డం పడినా జనం థియేటర్లకు పోటెత్తుతారు. అలాంటి ఉదాహరణలు సవాలక్ష వున్నాయి.

సినిమా నచ్చకుంటే మీడియా, సోషల్ మీడియా ఎంతగా డబ్బా కొట్టినా జనం వాసన కూడా చూడరు. ఈ వాస్తవం దిల్ రాజు లాంటి సీనియర్లకు తెలియంది కాదు. అయినా ఇంకా ఇప్పటికీ ఫ్యామిలీ స్టార్ సూపర్ సినిమా, సోషల్ మీడియానే దాన్ని కిందకు లాగేస్తోంది అని ఆయన అనుకుంటున్నారు అంటే అంత కన్నా పొరపాటు మరోటి లేదు.

దిల్ రాజు నిర్మాత..విజయ్ దేవరకొండ-మృణాళ్ జోడీ.. పరుశురామ్ దర్శకుడు. గీత గోవిందం కాంబినేషన్, స్టేజ్ మీద దిల్ రాజు డ్యాన్స్ లు, పాటలు, కామెడీ ఒకటి కాదు సమస్తం చేసారు. మరి యాభై శాతం కూడా ఓపెనింగ్ ఎందుకు రాలేదు. దానికి అయితే కారణం మీడియా, సోషల్ మీడియా కాదు కదా? సినిమా విడుదలయిన తరువాత కదా వాటి సంగతి. అంటే ప్రాజెక్ట్ మీద జనాలకు ఎక్కడో ఆసక్తి మిస్ అయింది. లేదా ప్రాజెక్ట్ ను పెర్ ఫెక్ట్ గా జనం ముందుకు తీసుకెళ్లడంలో టీమ్ ఎక్కడో ఫెయిల్ అయింది.

సరే, విడుదలైన తరువాత యాంటీ ఫ్యాన్స్ నుంచి కొంచెం గట్టిగానే వ్యతిరేకత వచ్చి వుండొచ్చు. పరుశురామ్ గతంలో హీరో చైతన్య పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు. విజయ్ కు వుంటే యాంటీ ఫ్యాన్స్ కావచ్చు. రావాల్సిన దాని కంటే కాస్త ఎక్కువే వ్యతిరేకత వచ్చి వుండొచ్చు. కానీ అదంతా సోషల్ మీడియాలోనే. సినిమాను కింద చూసే, ఫ్యామిలీ లకు ఇవి పట్టవు.

సినిమాలో సెకండాఫ్ ను పాడుచేసుకున్నారు దర్శకుడు. వన్స్ సినిమా ఇండియా నుంచి అమెరికా వెళ్లిన దగ్గర నుంచి గ్రాఫ్ కిందకు జారడం ప్రారంభమైంది. ఇదే సినిమాకు యావరేజ్ టాక్ ను తీసుకువచ్చింది. ఈ యావరేజ్ టాక్ ను నిర్మాత దిల్ రాజు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తాను గొప్పగా చెప్పిన సినిమా గొప్పది కాదు అని అంటే ఆయనకు నచ్చడం లేదు.

బలగం సినిమా హిట్ అయిన తరువాత దిల్ రాజు తన టేస్ట్, తన జడ్జ్ మెంట్ గురించి చాలా గొప్పగా ఫీలయ్యారు. మీడియా దానికి హెల్ప్ చేసింది అంటూ చెప్పుకొచ్చారు. అందులో ఏం స్టార్ కాస్ట్ వుందని జనం చూసారు. ముందుగా స్లోగా స్టార్ట్ అయిన ఆ సినిమా చివరకు ఎంత పెద్ద స్థాయికి ఎలా వెళ్లింది. తీసుకెళ్లింది మౌత్ టాక్.. జనమే కదా. శతమానం భవతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులే శ్రీనివాస కళ్యాణం సినిమాను పక్కన పెట్టారు.

ఏ సినిమా విషయంలో అయినా జనం, మౌత్ టాక్ అనేది కీలకం. దాన్ని గ్రహించాల్సిందే. దాన్ని పక్కన పెట్టి, సినిమాను ఎలాగైనా ముందుకు లాక్కు వెళ్లాలని దిల్ రాజు ప్రయత్నం చేయడం నిర్మాతగా ఆయన బాధ్యత అంత వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ కావాలని ఎవరో ఏదో చేస్తున్నారని అనుకుంటే మాత్రం సరి కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?