చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే

యంగ్ డైరక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

వీవీ వినాయక్ తో చిరంజీవి మరోసారి సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. పూరి జగన్నాధ్ కు కూడా అవకాశం ఇస్తాడేమో అంటూ ఫీలర్లు వినిపించాయి. కానీ ‘చిరు వరస’ మారింది. ఆయన సీనియర్ దర్శకులకు దూరంగా జరుగుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

విశ్వంభర సినిమా కొలిక్కి రావడంతో చిరు మరోసారి తన కొత్త సినిమాల ప్రకటనలు మొదలుపెట్టారు. ఈసారి ఆయన సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టారు. ఒక్క సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెలకు అవకాశం ఇచ్చారు. నాని సమర్పణలో, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.

ఈ మూవీతో పాటు అనీల్ రావిపూడితో కూడా సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు చిరంజీవి. కొత్త ఏడాదిలో ఈ సినిమా ప్రకటన వస్తుంది. ప్రస్తుతం వెంకీతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేస్తున్న రావిపూడి, ఈ మూవీ తర్వాత చిరంజీవితో చేయాల్సిన సినిమా పని మొదలుపెడతాడు.

ఇలా చూసుకుంటే, యంగ్ డైరక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ రెండు ప్రాజెక్టుల కంటే ముందు బోయపాటి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ ఆ సినిమాను కూడా తాత్కాలికంగా పక్కనపెట్టి శ్రీకాంత్ ఓదెల సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చిరంజీవి లాంటి స్టార్ ను డైరక్ట్ చేసే అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే వస్తుంది. పైగా అలాంటి స్టార్ తో హిట్ కొడితే వచ్చే కిక్కు మరో రేంజ్ లో ఉంటుంది. నిజంగా యంగ్ డైరక్టర్స్ కు ఇది మంచి అవకాశం.

39 Replies to “చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే”

  1. Ye director to teesina story lo change yem undadu. Hero still bachler. Pakkana oka young heroine. Choodalekapotunnam sir. Ee trap nunchi baitaki vachhi manchi movies teeyandi sir

      1. A lot of movies these days are trash and only useful for tax coverage and converting black loner to white money..

        only few people have passion for acting and doing movies.. a lot of trash gets auto clear only with age…but if that also not happening means telugu people karma…

      2. బొక్క demand ఆశ్రమ ధర్మాలు అనేవి edisaayi…62 కి govt retirement ఇవ్వడం jeddollu కాదు…పరుగు ఆపాలి 62కి కొత్త neeruki చోటివ్వాలి

      1. ఆడి మ….డ్ద చీ…కు ఐతే … బానిస పుత్ర అవకాశాలు ఇవ్వరారా ఇంకెవరికీ… వీడి ధాష్టీకలతో raj తరుణ్ దేవరకొండ తరుణ్ చాల మందిని తొక్కి monkey brands ni రుద్దుతున్నాడు..నీలాంటి foxes కి

  2. Nenu ye noriga comment pettina under moderetaion ani comments lo Naa comment choopinchatla. Vere vallu vallu bootulu pettina choopistundi.😄😄😄. Ayite ika site choodakapovadam better.

  3. A lot of movies these days are trash and only useful for tax coverage and converting black money to white money..

    only few people have passion for acting and doing movies.. a lot of trash gets auto clear only with age…but if that also not happening means telugu people karma…

Comments are closed.