రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు

తెలంగాణ‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, కాంగ్రెస్ నాయ‌కులంతా రోడ్డెక్కారు.

తెలంగాణ‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, కాంగ్రెస్ నాయ‌కులంతా రోడ్డెక్కారు. ఏఐసీసీ పిలుపు మేర‌కు అదానీ అర్థిక అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతి, మ‌నీలాండ‌రింగ్‌తో పాటు మ‌ణిపూర్ అల్ల‌ర్లు, విధ్వంసాల‌పై మోడీ స‌ర్కార్ వైఖ‌రిని నిర‌సిస్తూ చ‌లో రాజ్‌భ‌వ‌న్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్ర‌హం నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కూ ర్యాలీ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపా మున్షీ త‌దిత‌రులంతా నిర‌స‌నలో పాల్గొన్నారు. మోదీ, అదానీ జోడి.. దేశ ప్ర‌జ‌ల్లారా ఇక‌నైనా క‌ళ్లు తెర‌వండి అనే ప్ల‌కార్డును సీఎం రేవంత్‌తో పాటు ఇత‌ర నాయ‌కులు చేత‌ప‌ట్టుకుని నినాదాలు చేశారు.

అదానీతో కేంద్ర ప్ర‌భుత్వం చేతులు క‌లిపి, కార్పొరేట్ శక్తుల‌కు దాసోహం అయ్యిందంటూ కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శించారు. అదానిపై అమెరికాలో న‌మోదైన కేసుపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

అదానితో కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కున్న సంబంధాలేంట‌ని నిల‌దీశారు. ఇప్ప‌టికైనా అదానీకి ఏ ప్రాతిప‌దిక‌న విద్యుత్ వ‌ర్క్స్ ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

3 Replies to “రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు”

Comments are closed.