మొన్ననే సంక్రాంతి ముగిసింది. సంక్రాంతి సినిమాల సందడి తగ్గింది. అంతలోనే వచ్చే ఏడాది సంక్రాంతిపై టాలీవుడ్ దృష్టి పెట్టింది. ఈ సీజన్ ఏ రేంజ్ లో కాసులు కురిపిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్-నీల్ సినిమాను ఆల్రెడీ సంక్రాంతి సీజన్ కు లాక్ చేశారు. 2026, జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు చిరంజీవి సినిమా కూడా వచ్చి చేరింది. అనీల్ రావిపూడి, చిరంజీవి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాత సాహు గారపాటి ప్రకటించాడు.
అయితే ఇవన్నీ ప్రాధమికంగా అనుకునే మాటలే. ఆ టైమ్ కు వచ్చేసరికి ఎన్నో లెక్కలు మారిపోతాయి. ఇంకొన్ని సినిమాలు ఆ తేదీలకు వస్తాయి. ప్రతి ఏటా జరిగే తంతే ఇది. అయితే చిరు-రావిపూడి సినిమాపై మాత్రం కాస్త నమ్మకంగా ఉన్నారు జనం.
సంక్రాంతి బరిలో రావిపూడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. దీంతో సంక్రాంతి సీజన్ ఇతడికి సెంటిమెంట్ గా మారింది. అటు చిరంజీవి కూడా సంక్రాంతికొచ్చి చాన్నాళ్లయింది. ఈ ఏడాది జస్ట్ మిస్సయింది. వచ్చే ఏడాది మిస్ చేయడానికి వీల్లేదు అన్నట్టుంది పరిస్థితి.
ఎటొచ్చి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై మాత్రం డౌట్స్ ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ కైనా, అటు నీల్ కైనా ఏడాది టైమ్ సరిపోదు. వాళ్లకు ఇంకా ఎక్కువ టైమ్ కావాలి. అదే రావిపూడికైతే 5 నెలల టైమ్ కూడా చాలా ఎక్కువ.
ప్లే బాయ్ వర్క్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
అక్కినేని నాగ్యాడు కేవలం1 నెలలో సినిమా చుట్టేసి మధ్యలో దూరిపోతాడు