మెగాస్టార్ కు డ్యాన్స్ ల రికార్డు!

మెగాస్టార్ చిరు అంటేనే గ్రేస్.. డ్యాన్స్. తెలుగు సినిమాల్లో పాటలను కొత్త మలుపు తిప్పింది మెగాస్టార్ చిరంజీవి నే. అప్పటి వరకు పాటల్లో డ్యాన్స్ లు వేరు మెగాస్టార్ ఎంట్రీ తరువాత వేరు. Advertisement…

మెగాస్టార్ చిరు అంటేనే గ్రేస్.. డ్యాన్స్. తెలుగు సినిమాల్లో పాటలను కొత్త మలుపు తిప్పింది మెగాస్టార్ చిరంజీవి నే. అప్పటి వరకు పాటల్లో డ్యాన్స్ లు వేరు మెగాస్టార్ ఎంట్రీ తరువాత వేరు.

దాదాపు 150 కి పైగా సినిమాల్లో వందలాది పాటలు చేసారు. ఇది ఓ రికార్డు. హాలీవుడ్ సినిమాల్లో పాటలే వుండవు.. డ్యాన్స్ ల సంగతి సరే సరి. బాలీవుడ్ లో ఇన్ని వందల సినిమాలు చేసిన వారు తక్కువ. పాటలు తక్కువ. డ్యాన్స్ లు తక్కువ.

ఇలాంటి నేపథ్యంలో దాదాపు 150 కి పైగా సినిమాలు చేయడం, వాటిలో పాటలు, డ్యాన్స్ లు.. ఇవన్నీ రికార్డే కదా. అందుకే మెగాస్టార్ కు ఓ పెద్ద సంస్థ వరల్డ్ రికార్డు ను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. దానినే ఈ రోజు సాయంత్రం జ‌రిగే ఓ స్పెషల్ కార్యక్రమంలో అమీర్ ఖాన్ చేతుల మీదగా ప్రకటిస్తార‌ని తెలుస్తోంది.

ఈ సాయంత్రం కోహినూర్ హోటల్ లో లిమిటెడ్ గెస్ట్ ల నడుమ ఈ కార్యక్రమం జ‌రుగుతుంది. అమీర్ ఖాన్ దీని కోసం ముంబాయి నుంచి వస్తున్నారు.

6 Replies to “మెగాస్టార్ కు డ్యాన్స్ ల రికార్డు!”

  1. 24 వేల స్టెప్స్ అని రాసారు, అవి ఎలా లెక్కపెట్టరబ్బా? భారత నాట్యం డాన్సర్స్ లు చాల మంది 40 ఏళ్ళు పైనే ప్రదర్శన లు ఇచ్చి వున్నారు. వాళ్ళ భంగిమ లు ఎక్కువే ఉంటాయి. సినిమా పాటల క్యాటగిరీ కి ఇచ్చి ఉండొచ్చు. డాన్స్ పాటల్లో చిరు ని బీట్ చేసే వాళ్ళు ఇప్పట్లో లేనట్టే. జూనియర్, అర్జున్ కి ఇన్ని సినిమాలు చేసే ఛాన్స్ రాకపోవచ్చు. గ్రేట్ ఫీట్ బై చిరు.

Comments are closed.