రెండు జానర్లు…రెండు సినిమాలు..పోటీ

యంగ్ హీరోలు శర్వానంద్, వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ఆడవాళ్లూ మీకు జోహార్లు. గని. రెండూ రెండు రకాల సినిమాలు. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి ఆఖరి వారంలో ఒకేసారి విడుదలవుతున్నాయి. ఒక విధంగా…

యంగ్ హీరోలు శర్వానంద్, వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ఆడవాళ్లూ మీకు జోహార్లు. గని. రెండూ రెండు రకాల సినిమాలు. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి ఆఖరి వారంలో ఒకేసారి విడుదలవుతున్నాయి. ఒక విధంగా ఒక దానికి మరోటి పోటీ. కానీ వాస్తవానికి రెండూ వేరు వేరు .

ఆడవాళ్లూ మీకు జోహార్లు పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సీనియర్ హీరోయిన్లు కుష్బూ. రాధిక, ఊర్వశి ఇంకా అనేక బలమైన స్టార్ కాస్ట్ తో రూపొందిన సినిమా. దర్శకుడు కిషోర్ తిరుమల అందిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. హీరో శర్వా కూడా ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. సుధాకర్ ఈ సినిమాకు నిర్మాత.

వరుణ్ తేజ్ ఫిజికల్ గా బాడీ బలంగా పెంచి, చేస్తున్న బాక్సింగ్ సినిమా గని. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. గీతా సంస్థ ఈ సినిమాను సమర్పిస్తోంది అల్లు బాబి, సిద్దు నిర్మాతలు. బాక్సింగ్ నేపధ్యంలో తయారవుతున్న యాక్షన్ ఎమోషనల్ సినిమా ఇది.

ఈ రెండు సినిమాలు విడుదల కావడానికి అవకాశం ఇచ్చింది భీమ్లా నాయక్. ఆంధ్రలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ సినిమా వాయిదా పడింది. దాంతో ఈ రెండూ లైన్లోకి వచ్చాయి. ఎలా వుంటాయో చూడాలి.