నాని నిర్మాతగా వచ్చిన రెండు సినిమాలు హిట్ వన్.. హిట్ 2. ఈ రెండు సినిమాలు పెద్ద హిట్. అడవి శేష్, విష్వక్ సేన్ ఇద్దరూ ఆ సినిమాల్లో చేసిన పరిశోధన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ సరైన పరిశోధన చేస్తే అది వేరుగా వుంటుంది. అనేకానే మలయాళ సినిమాల్లో ఇది చూసాం. హిట్ 1, హిట్ 2 లో కూడా చూసాం. కానీ ఇప్పుడు హిట్ 3 రాబోతోంది. ఇది వేరే. శోధన కాదు. ఓ అధికారి వేదన. ఆ వేదనలోంచి పుట్టిన బలమైన బాదుడు.
హిట్ 3 ట్రయిలర్ ఆద్యంతం ఇటు యాక్షన్ అటు ఎమోషన్ మీద వెళ్లింది. ట్రయిలర్ ఓపెనింగ్ షాట్ నే తొమ్మిది నెలల పాప మీద కత్తి ఎత్తడంతో స్టార్ట్ అయింది. అంటే అంతకన్నా దారుణం మరోటి లేదు. అంత దారుణం చేసిన వారిని ఇంకెంత దారుణంగా శిక్షించాలి అన్న పాయింట్ వస్తుంది. ఇక హీరో ఎన్ని నరుకుళ్లు, రక్తపాతాలు చేసినా లాజిక్ వుంటుంది. జనం సంతృప్తి చెందుతారు. ఇదీ మేకర్ల ఆలోచన కావచ్చు.
కానీ హిట్ సిరీస్ ను నచ్చిన వారిలో ఎక్కువ మంది ఈ పరిశోధన నచ్చినవారే. ఇప్పుడు వారికి ఈ రక్తపాతం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తానే అతి దారుణంగా పనిష్ చేయడం వంటివి ఎంత వరకు నచ్చుతాయో చూడాలి.
ట్రయిలర్ లో తొలి డైలాగ్ బాలేదు. పాపకు తొమ్మిదినెలలు సర్.. ఏం చేస్తారు సర్ తీసుకెళ్లి.. అంటుంది తల్లి. పాపకు తొమ్మిది నెలలు సర్.. చంపేస్తారేమో అని భయంగా వుంది…అని కదా అనాల్సింది. క్రిమినల్స్ అయితే భూమిలోపలి గోతిలో వుండాలి లేదా జైలు గదిలో వుండాలి అనే డైలాగా బాగుంది. ఏదైనా సరే, ఓ ఇన్వెస్టిగేటివ్, సైకో థ్రిల్లర్ సినిమాకు ఇంత బ్లడ్ షెడ్ అవసరామా అన్నది చూడాలి.
నాని వీర.. ఊరమాస్ క్యారెక్టర్ లో చూడాలి అనుకునే వారికి నచ్చవచ్చు. ఇంత రక్తపాతం నచ్చనివారికి నచ్చకపోవచ్చు. హీరో కూడా అదే చెబుతున్నారు..అలాంటి వాళ్లు చూడొద్దు అని.
my opinion only.
Hit movie Hit
Hit 2 – also fine
Hit 3 – little clumsy undi anukuntunna !!
All the best
Ee director Indian Quentin Tarantino ani feel avutademo
very interested in hit 3