ఆయన కోట్ల సంపాదనను, సినిమాలను త్యాగం చేశాడు!

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విమర్శించే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశాడు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విమర్శించే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఆయన గొప్ప త్యాగమూర్తి అని ప్రశంసించాడు. అరవింద్ కవితను ఎందుకు విమర్శించాడు? పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎందుకు ఎత్తేశాడు?

ఎందుకంటే.. కవిత ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించింది. దీంతో తెలంగాణలోని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కవితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు అరవింద్ కవితపై విమర్శలు గుప్పించాడు. ఇంతకూ కవిత పవన్ ను ఏమని విమర్శించింది ?

పవన్ కళ్యాణ్ అనుకోకుండా అంటే అదృష్టం కొద్దీ ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యాడని కవిత అన్నది. పవన్​ కళ్యాణ్​ ఇప్పటికీ సీరియస్​ పొలిటీషియన్​ కాదని చెప్పింది. ఆయన ఏం మాట్లాడినా సీరియస్​గా తీసుకోనక్కరలేదని అన్నది.

పవన్​ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కమ్యూనిస్టు పార్టీల భావజాలంతో కనిపించేవాడని, చేగువేరా తనకు ఆదర్శమని చెప్పేవాడని కవిత అన్నది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు కూడా పెట్టుకున్నాడని గుర్తు చేసింది. కాని క్రమంగా వామపక్ష భావజాలం నుంచి బీజేపీ భావజాలంవైపు వచ్చాడని అన్నది.

డిప్యూటీ సీఎం పవన్ హిందీపై చేసిన కామెంట్స్, సనాతన ధర్మ పోరాటం గురించి ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు. అందుకు ఆమె స్పందిస్తూ.. అనుకోకుండా పొరుగు రాష్ట్రానికి డిప్యూటీసీ సీఎం అయిన పవన్ కల్యాణ్ మాటలను సీరియస్‌గా తీసుకోను. రాజకీయాల్లో ఆయన చేసిన ప్రతీది ప్రశ్నార్థకంగా ఉంటోంది. చెగువేర ఎటు వెళ్లిపోయాడో, ఇప్పుడు పూర్తిగా రైటిస్టుగా ఎందుకు మారిపోయాడో నాకు తెలియడం లేదు. రాజకీయంగా ఆయన ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా తనకు తానే విభేధించుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి రేపు తమిళనాడు వెళ్తే హిందీ అమలు చేయడానికి వీల్లేదని చెప్పినా చెబుతారు. అందుకే నిజంగా ఆ వ్యాఖ్యలపై స్పందించాలని లేదు. సీరియస్ రాజకీయ నాయకుడని అనుకోవడం లేదు. అనుకోకుండా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కానీ సీరియస్ రాజకీయవేత్త మాత్రం కాదని కవిత చెప్పింది.

కవిత చేసిన తాజా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆమె వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్ చేస్తూ జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అరవింద్ మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని అన్నాడు. తానూ కూడా ఆయన అభిమానినేనని చెప్పాడు. పవన్ రాజకీయాల్లోకి రాకముందే పెద్ద ఫేమ్​ సంపాదించుకున్నాడని, మరి కవిత బ్యూటీ పార్లర్ పెట్టి ఫేమ్​ సంపాదించుకుందా? అని అరవింద్ ప్రశ్నించాడు.

సినిమాల్లో చిరంజీవి కంటే నాలుగు రెట్లు ఎక్కువ సంపాదించే పవన్ కోట్లాది రూపాయల సంపాదనను, సినిమాలను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చాడని అరవింద్ అన్నాడు. ఇది మామూలు త్యాగం కాదని, చాలా పెద్ద త్యాగమని అన్నాడు. పవన్ పై కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనమని విమర్శించాడు. పవన్ కళ్యాణ్ కు అరవింద్ మద్దతుగా మాట్లాడటంలో తప్పులేదు. ఎందుకంటే …ఆయన పార్టీ బీజేపీతో అంటకాగుతోంది కదా.

10 Replies to “ఆయన కోట్ల సంపాదనను, సినిమాలను త్యాగం చేశాడు!”

  1. ఎవరికి దానం చేశాడు నెలకి 50cr పాకేజ్ తీసుకుంటున్నాడు.. లెక్కలు కావాలి అంటే లోకేష్ నో అడగండి చెబుతాడు

  2. నువ్వు కూడా ఆఖరికి జైల్లో చిప్పకూడు తినొచ్చిన నువ్వు కూడానా లిక్కర్ రాణి

  3. PK has left movies and income and came into politics. There is nothing great about it as it is his choice and democratic right .. No need to glorify that.. We are happy if he plays real hero role in politics. But, I see that he too does not care for manifesto and did untruthful mudslinging on YCP govt like missing women, laddu fiasco, YCP painting cost for buildings, the seise the ship debacle etc. He is quite amateurish and dangerous as he is also speaking vehemently on sensitive religious issues without knowing implications and backlash.

  4. పీకే సినిమాలు, ఆదాయం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. దానిలో గొప్పతనం ఏమీ లేదు 
    ఎందుకంటే అది అతని ఎంపిక మరియు ప్రజాస్వామ్య హక్కు.. దానిని కీర్తించాల్సిన అవసరం
    లేదు.. అతను రాజకీయాల్లో నిజమైన హీరో పాత్ర పోషిస్తే మేము సంతోషిస్తాము. కానీ, ఆయన
    కూడా మ్యానిఫెస్టోను పట్టించుకోలేదని, మహిళలు కనిపించకుండా పోవడం, లడ్డూ వైఫల్యం,
    భవనాలకు వైసీపీ పెయింట్ ఖర్చు, ఓడను స్వాధీనం చేసుకోవడం వంటి అసత్యమైన
    బురదజల్లులు చేశారని నేను చూస్తున్నాను. అతను చాలా ఔత్సాహికుడు మరియు
    ప్రమాదకరమైనవాడు ఎందుకంటే అతను సున్నితమైన మతపరమైన అంశాలపై కూడా
    చిక్కులు మరియు ఎదురుదెబ్బలు తెలియకుండా తీవ్రంగా మాట్లాడుతున్నాడు.
    1. ఆదాయం వదిలేసి రాజకీయాలలోకి వస్తే గొప్పతనం కాదు, కానీ రాజకీయాలను ఆదాయ వనరులుగా మార్చుకోవటం చాలా పెద్ద గొప్పతనం కదూ ?

  5. అది అవినీతి సొమ్ములో కూరుకుపోయిన లిక్కర్ డిస్కో రాణి .. దానికి కౌంటర్ ఇవ్వడం టైం వేస్ట్ ధర్మపురి గారు .

Comments are closed.