టీటీడీ ఈవో అయితే మ‌నోభావాల్సి దెబ్బ తీయొచ్చా?

టీటీడీ ఎస్వీ గోశాల‌లోని గోవుల మృతిపై పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు ఎవరి వాద‌న వారిది. ఇద్ద‌రి వాద‌న‌ల్లోనూ గోవులు మృతి చెందాయ‌నే ఏకాభిప్రాయం.

టీటీడీ ఎస్వీ గోశాల‌లోని గోవుల మృతిపై పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు ఎవరి వాద‌న వారిది. ఇద్ద‌రి వాద‌న‌ల్లోనూ గోవులు మృతి చెందాయ‌నే ఏకాభిప్రాయం. కానీ సంఖ్య ద‌గ్గ‌రే పేచీ. మూడు నెల‌ల్లో వంద‌కు పైగా గోమాత‌లు మృతి చెందాయ‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆరోపించ‌డం భ‌క్తుల మ‌నోభావాల్ని దెబ్బ తీయ‌డమే అని తాజాగా ఈవో శ్యామ‌లారావు తెలిపారు. ఇదే ఈవో అన్ని గోవులు కాదు, కేవ‌లం 43 మాత్ర‌మే ప్రాణాలు కోల్పోయాయ‌ని చెప్పుకొచ్చారు.

ఎస్వీ గోశాల‌లో ఒక్క గోమాత ప్రాణం పోయినా, తీవ్ర‌మైన విష‌యంగా ప‌రిగ‌ణించాల్సి వుంటుంది. అలాంటిది కేవ‌లం 43 మాత్ర‌మే ప్రాణాలు పోయాయ‌ని చెప్పిన ఈవో మాట‌ల్ని ఎలా తీసుకోవాలో భ‌క్తులు నిర్ణ‌యించుకుంటారు. భ‌క్తుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీయ‌డం కాదా ఇది? అనే ప్ర‌శ్న‌కు ఈవో స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

అలాగే నెల‌కు స‌రాస‌రి 15 చొప్పున ఆవులు ప్రాణాలు కోల్పోతున్నాయ‌ని ఈవో ఎట్ట‌కేల‌కు వాస్త‌వాల్ని అంగీక‌రించారు. ఇదే మాటే క‌దా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చెబుతున్న‌ది కూడా అనే చ‌ర్చ జ‌నంలో జ‌రుగుతోంది. మొద‌ట ఫేక్ ప్ర‌చార‌మ‌ని కొట్టి పారేసిన టీటీడీ, మూడు రోజులు గ‌డిచేస‌రికి నెమ్మ‌దిగా వాస్త‌వాల్ని అంగీక‌రించాల్సిన అనివార్య‌త ఏర్ప‌డింది. తాజాగా టీటీడీ ఈవో శ్యామ‌లారావు మాట‌లు ఎలా ఉన్నాయంటే …త‌మ హ‌యాంలోనే కాదు, గ‌త వైసీపీ పాల‌న‌లోనూ గోవుల ప్రాణాలు పోయాయి క‌దా అని స‌మ‌ర్థించుకోడానికి పేల‌వ‌మైన వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు.

గ‌తంలో టీటీడీ గోశాల‌లో భారీ అక్ర‌మాలు జ‌రిగాయంటున్న ఈవో… ఇప్ప‌టి వ‌ర‌కు చర్య‌లు ఎందుకు తీసుకోలేక‌పోయారో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలి. గోశాల‌లో గోమాత‌లు ప్రాణాలు పోయాయ‌ని ఆరోప‌ణ‌లు చేస్తే, బెదిరించ‌డానికి అన్న‌ట్టుగా ఈవో ఇత‌రేత‌ర అంశాల్ని తెర‌పైకి తీసుకొచ్చారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌డం ఎంత నేర‌మో, వాటి గురించి తెలిసి కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం కూడా అంతే త‌ప్ప‌ని ఈవోకు తెలియ‌దా? చేతిలో అధికారం పెట్టుకుని, రాజ‌కీయ నాయ‌కుల్లా కేవ‌లం విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంటి? ఇలాంటి మాట‌ల‌తో ఈవో మ‌రింత ప‌లుచ‌న అవుతాన‌ని గ్ర‌హిస్తే మంచిది.

9 Replies to “టీటీడీ ఈవో అయితే మ‌నోభావాల్సి దెబ్బ తీయొచ్చా?”

  1. ఇదే విషయమై ఇప్పటికే చాలా రాశారు, చూస్తుంటే ఇదేదో బాధగా చెబుతున్నట్లు లేదు, ఇంకేదో అవకాశం కోసం చూస్తున్నట్లుంది.

    ‘చచ్చు’ వెధవలు, ‘చావు’ ల్లోనే ఆనందాలు వెతుక్కుంటారు.

  2. వైసీపీ ఎందుకు కనీసం ఇంకో దశాబ్దం అధికారంలోకి రాదు అనే దానికి మరో ఉదాహరణే టీటీడీ మీద వాళ్ళు ఏడ్చే ఏడుపులు, చూపించే ద్వేషం. ఆ ధ్వేషమే వాళ్లని నాశనం చేస్తుంది. ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటారు.

    1. అవును ల డ్డు లో కొ వ్వు కల్సింది అని అబద్దపు ప్రచారాలు చేసి సుప్రీమ్ కోర్ట్ తో చీవాట్లు తిన్నారు చూడు , అందుకు రాదేమో వైసీపీ ఇంకో దశాబ్ద కలం పటు అధికారం లోకి , ఎన్నడూ లేనిది తోపులాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు చూడు అందుకు రాదా వైసీపీ ఇంకో దశాబ్ద కలం పటు అధికారం లోకి

      1. లేదు తమ్ముడు .. సీపీస్ రద్దు చేసేసాం, మద్యపాన నిషేధం చేసేసాం, ఇంటి ఇంటికి మంచి చేసేసాం అందుకు రాదులే

        1. Topic TTD gurinchi annayya, meeru enduku vere vishayalu matladatharu, okanokappudu madyapana nishedham NTR garu pedithe, mee isonary dani raddu chesadu , adi marchipoyara annayya

          1. adhi gurthu undi tammudu marchipoledu .. .. manam 2019 lo chestam ani ennikala mundu cheppaam chesama leda ? simple answer yes or no .. anthe .. madyalo NTR enduku ..

          2. annayya akkada mee pachha mithrudu ttd gurinchi matladithe topic divert chesindi nuvvu. TTD ni prakshalana chesthamani cheppi, adhikaram loki vachhinappati nundi ekkada leni daridralu anni chupisthunnaru. 1999 lo geichadu mari, 2004 lo enduku gelvaledu, 2009 lo, 2019 lo enduku gelvaledu, pasupu kunkuma ichhadu kadaa…anduke kalalu kanandi , vatilone jeevinchakandi , gelupu otamulu sahajam, appudu Jagan anna, ippudu meeru anna evariki adhikaram shasvatham kadu…

Comments are closed.