ఎన్టీఆర్ సినిమాల లైనప్ అంటే వార్ 2, ప్రశాంత్ నీల్, నీల్సన్ అంటారు ఎవరైనా. ఎందుకంటే దేవర 2 ఎప్పుడు వుంటుందో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఇటీవలే ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర 2 వుంటుంది అని పక్కాగా క్లారిటీ ఇచ్చేసారు. దాంతో అభిమానులు కొందరు హ్యపీ అయ్యారు. కొందరు ఎందుకు దేవర 2 అనుకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇచ్చిన ఇంటర్వూలో నందమూరి కళ్యాణ్ రామా క్లారిటీ ఇచ్చేసారు. దేవర 2 వుంటుందని చెప్పడమే కాదు ఎప్పుడు వుంటుందో కూడా చెప్పారు.
దేవర కన్నా ముందే వార్ 2 ఎన్టీఆర్ ఓకె చేసారని, అలాగే సలార్ కన్నా ముందే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా ఖరారు అయిందని కళ్యాణ్ రామ్ వివరించారు. అభిమానులు దేవర 2 సినిమా కావాలని కోరుకుంటున్నారని, అందువల్ల తప్పకుండా వుంటుందని, అంతే కాదు, నీల్సన్ సినిమా కన్నా ముందే వుంటుందని క్లారిటీ ఇచ్చారు.
నిజానికి దేవర 2 సినిమాను తన లైనప్ లో ఎన్టీఆర్ ఎక్కడ ఇముడుస్తారా అన్నది ఇన్నాళ్లూ క్వశ్చన్ గా వుంటూ వచ్చింది. కళ్యాణ్ రామ్ చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే నీల్సన్ సినిమా చాలా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
హాయ్
ఇంకో గునపం రెడీ అన్నమాట
గునపం పెట్టించుకోవడమే
DEVARA chala bagundhi mithrama.
Waiting we also
Waiting all
Hi
Hi