సంక్షేమంపై బాబు కామెంట్స్.. ఆహాఓహో!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నుంచి రాజ‌కీయ నాయ‌కులు నేర్చుకోవాల్సింది చాలా వుంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నుంచి రాజ‌కీయ నాయ‌కులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఏం చేసినా, చేయ‌క‌పోయినా … అన్నీ చేసిన‌ట్టే ఆయ‌న న‌మ్మించేలా క‌ళ్లార్ప‌కుండా మాట్లాడుతుంటారు. రాజ‌కీయాల్లో పైకి రావాలంటే ఉండాల్సిన మొద‌టి గుణం ఇదే. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా చంద్ర‌బాబు స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారంటే, ఇదే ఆయ‌న‌లోని గొప్ప‌త‌నం.

గుంటూరు జిల్లాలో ఇవాళ ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై ఆయ‌న మాట‌లు వింటే, ఆశ్చ‌ర్యంతో ఆహాఓహో అని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేరు. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని సంక్షేమ ప‌థ‌కాల్ని ఏపీలో అందిస్తున్నామ‌ని చంద్ర‌బాబు ఘ‌నంగా ప్ర‌క‌టించడం విశేషం. పేద‌ల‌కు అండ‌గా నిలిచామ‌న్నారు. వైసీపీ హ‌యాంలో భ‌యాన‌క ప‌రిస్థితుల్ని చూశామ‌న్నారు. న‌ష్ట‌పోయిన ఏపీని పున‌ర్‌నిర్మాణం చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

2019-24 మధ్య ప్రజలు ఆనందంగా ఉన్న రోజులే లేవని ఆయన అన్నారు. తనలాంటి వాళ్లు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పేదల జీవితాలు మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల అమ‌లు ఏ ద‌శ‌లో వుందో అంద‌రికీ తెలుసు. రాష్ట్ర అప్పు చూస్తుంటే భ‌య‌మేస్తోంద‌ని, కానీ ఒక్కొక్క‌టిగా ఇచ్చిన హామీని అమ‌లు చేస్తామ‌ని త‌ర‌చూ చంద్ర‌బాబు అంటుంటారు. అదే చంద్ర‌బాబు చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో త‌మ హ‌యాంలోనే సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని చెప్ప‌డం ఆయ‌న‌కే చెల్లింది. సంక్షేమ ప‌థ‌కాల‌పై ల‌బ్ధిదారులే అనుమానప‌డేలా చంద్ర‌బాబు మాట‌లున్నాయి. బాబు అన్నీ చేస్తున్నార‌ని, కానీ మ‌న‌కు మాత్ర‌మే అంద‌లేదేమో అని ఎవ‌రికి వారు అనుకునే ప‌రిస్థితి.

12 Replies to “సంక్షేమంపై బాబు కామెంట్స్.. ఆహాఓహో!”

Comments are closed.