ఫ్లాప్ అయిన అన్ని సినిమాలకు పోస్టుమార్టం అవసరం లేదు. కానీ కొన్ని సినిమాలకు మాత్రం తప్పనిసరి. ఈ సీజన్ లో అలా విశ్లేషించుకోవాల్సిన సినిమా జాక్. చిన్న సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చింది జాక్. కానీ అందరి ఊహలకు భిన్నంగా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.
జాక్ నుంచి ఆడియన్స్ ఊహించింది వేరు. సిద్ధు జొన్నలగడ్డ నుంచి వాళ్లు ఒకటి ఆశిస్తే, మేకర్స్ ఇంకోటి అందించారు. దీనికితోడు తన మార్క్ మేనరిజమ్స్, కామెడీ నుంచి అతడు కాస్త పక్కకురావడం ఆడియన్స్ కు నచ్చలేదు.
ఈ కాలం ఓ సినిమాకు విడుదలకు ముందే హైప్ రావాలంటే కనీసం ఒక్క పాటైనా హిట్టవ్వాలి. అందులో ఒక హుక్ స్టెప్ అయినా ఉండాలి. రీల్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోవాలి. అలాంటి ట్రెండింగ్ ఏదీ జాక్ కు కనిపించలేదు. ఈసారి మ్యూజిక్ విషయంలో తామంతా ఫెయిల్ అయ్యామని, విడుదలకు ముందే హీరో చెప్పాడంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
దీనికితోడు సినిమాను ఎలా తీయాలనే అంశంపై హీరో-దర్శకులు ఒక ఏకాభిప్రాయానికొచ్చినట్టు లేదు. కొన్నిచోట్ల సీరియస్ గా, కొన్ని చోట్ల మరీ సిల్లీగా సినిమా తీశారు. సిద్ధు మినహా మరో పుల్లింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం కూడా జాక్ కు ప్రతికూల అంశంగా మారింది.
నా సినిమా నా ఇష్టం అంటూ సిద్ధు జొన్నలగడ్డ ఎలాగైనా ఈ సినిమాను తీసుకోవచ్చు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో దర్శకుడ్ని సైతం పక్కనపెట్టి తనే అన్నీ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ గా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా.
బహుశా, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఉండొచ్చు. దాని ఫలితం ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికే చాలా స్క్రీన్స్ నుంచి జాక్ సినిమాను తప్పించారు.
This is a lesson for Siddhu. Dude, the failure and success are part of the game. Bu humble and work your way. I have subtly seen that you and Vishwaksen got a little bit success into your head and this is one big lesson guys. Count on content, novelty and taling…mere mannerisms and silliness would not win always
ఒకే మ్యానరిజం తో మాటిమాటికీ సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులకు వెగటు పుట్టి ఫ్లాప్ చేస్తారు…
ఒకే మూస ధోరణిలో సినిమాలు చేస్తుంటే ఎస్సావీ కృష్ణా రెడ్డి, కే విశ్వనాధ్, కే రాఘవేంద్ర రావు లాంటి వాళ్లనే ఇక చాల్లే ఆపండని ఆడియన్స్ పక్కన కూర్చోపెట్టారు, టిల్లు/ భాస్కర్ ఎంత?
మ్యానరిజం తో చేసినా చేయకున్నా కథ కథనం బాగుండాలి, దర్శకుడిని తన పని తాను చేసుకోనివ్వాలి, మంచి సినిమా రావాలి… అదే ప్రేక్షకుడు కోరుకునేది
Jack flop movie
Yes flop movie