తను నిర్మాతగా మారి సినిమాలు నిర్మించబోతున్నాననే విషయాన్ని ఆమధ్య కాజల్ స్వయంగా ప్రకటించింది. తన నిర్మాణ సంస్థకు కేఏ వెంచర్స్ అనే పేరు కూడా పెట్టబోతున్నట్టు తెలిపింది. అయితే నిర్మాణంలో రావాలని ఉందని, సరైన పార్టనర్ కోసం ఎదురుచూస్తున్నానని, అందుకే ఆలస్యం అవుతోందని చెప్పుకొచ్చింది. ఎట్టకేలకు కాజల్ కు ఓ వేదిక దొరికింది. ఆమె నిర్మాతగా తీయబోయే సినిమా దాదాపు ఫిక్స్ అయింది.
తను ఎంతగానో నమ్మే తేజ దర్శకత్వంలో నిర్మాతగా మారాలని కాజల్ భావిస్తోంది. ఈ మేరకు వీళ్లిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. కాజల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసినవ్యక్తి తేజ. రీసెంట్ గా ఆమెతో సీత అనే సినిమా కూడా తీశాడు. ఈ సినిమాలో కాజల్ పాత్రే హైలెట్.
ఇప్పుడు ఆమెతోనే మరో లేడీ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు తేజ. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో తేజ దర్శకత్వంలో నటిస్తూనే, అదే సినిమాతో నిర్మాతగా కూడా మారాలని కాజల్ నిర్ణయించుకుందట. ఈ మేరకు తేజ-కాజల్ మధ్య చర్చలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ తన తొలి సినిమాకే కాజల్, తేజ లాంటి దర్శకుడ్ని ఎంచుకోవడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, నేనేరాజు నేనే మంత్రికి ముందు, ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడు హిట్స్ ఇచ్చిన దాఖలాల్లేవ్.
తేజకు మార్కెట్, క్రేజ్ రెండూ లేవు. ఇలాంటి దర్శకుడితో నిర్మాతగా తొలి సినిమా చేయడమంటే, కాజల్ రిస్క్ చేస్తున్నట్టే. నిర్మాతగా తన తొలి సినిమాకు కాజల్ ఏదైనా మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ఎంచుకుంటే బాగుండేది.