లెక్కప్రకారం ఈరోజు సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఈరోజు కంగనా స్వయంగా ప్రకటించింది.
అవును.. అన్నీతానై కంగనా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీనిపై ఇప్పటికే యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే కంగనాకు అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో సినిమా వాయిదా అనివార్యమైంది.
ఈ సినిమా సెన్సార్ కు సంబంధించి ఇప్పటికే యూనిట్ కు, బోర్డు సభ్యులకు మధ్య సంప్రదింపులు నడుస్తున్నాయి. బోర్డ్ దాదాపు 14 కట్స్ సూచించింది. వాటిని తొలిగించిన తర్వాతే రీ-సెన్సార్ పెట్టుకుందామని కోరింది.
ఈ సినిమాపై శిరోమణి అకాలీదళ్ తో పాటు కొన్ని సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ వర్గాన్ని సినిమాలో తప్పుగా చూపించారని, చారిత్రక వాస్తవాల్ని వక్రీకరించారని వాళ్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తరాదిన పలు కోర్టు కేసులు పడ్డాయి. తెలంగాణలో కూడా ఎమర్జెన్సీ సినిమాను నిషేధించే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, కేసులు, విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని బాంబే హైకోర్టు ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. కేసును సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. అంటే, మరో 2 వారాలు ఎమర్జెన్సీ సినిమా విడుదలకానట్టే.
Call boy jobs available 8341510897
neevevavura kojj aga
vc estanu 9380537747
Eka parama pada bhaktula sangate ela unte, vere valla sangati devuderugu. Anduke edi turakolla meeda cinima teesunte bhktulu, pujarulu anduru support chesevallu, dabbu kuda baaaaaga vachedi
ఎప్పుడు విడుదల అయినా మేం థియేటర్లో చూడం
Illanti movies release aithe nijalu bayataku vasthai