20వ అంతస్తులో నాగచైతన్య బైకు

50 ఏళ్లు వచ్చేసరికి, నాకు ఓ భార్య ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలుండాలి. నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్లాలి.

ఎవరైనా బైక్ ను సెల్లార్ లో పార్క్ చేసుకుంటారు. 20వ అంతస్తుకు ఎవరైనా తీసుకెళ్తారా? నాగచైతన్య మాత్రం తీసుకెళ్తాడు. బైక్స్ అంటే ఇతడికి అంత పిచ్చి మరి.

నాగచైతన్యకు బైకులు, కార్లు అంటే ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. అతడికి అవంటే ఎంతిష్టమో తెలిపే ఘటన ఇది. నాగచైతన్య దగ్గర ఓ స్పోర్ట్స్ బైక్ ఉంది. ఆ బైక్ అంటే అతడికి పిచ్చి.

గతంలో ఓ కొత్త ఫ్లాట్ తీసుకున్నాడు నాగచైతన్య. అది 20వ అంతస్తులో ఉంది. తనకిష్టమైన ఆ స్పోర్ట్స్ బైక్ ను క్రేన్ లో 20వ అంతస్తుకు తీసుకెళ్లి, తన లివింగ్ రూమ్ లో పెట్టుకున్నాడు.

తనకు బైకులు, కార్లు అంటే చాలా ఇష్టమని, అందుకే ఆ పని చేశానని, ఆ టైమ్ లో తనను చూసి అంతా పిచ్చోడు అనుకున్నారని, కానీ తనకు నచ్చింది మాత్రమే తను చేశానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంపై కూడా స్పందించాడు చై.

“50 ఏళ్లు వచ్చేసరికి, నాకు ఓ భార్య ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలుండాలి. నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్లాలి. నాతో వాడు గోకార్టింగ్ చేయాలి. కూతురు ఉంటే ఆమె హాబీల్ని నేను అలవాటు చేసుకోవాలి. తనతో ఎక్కువసేపు గడపాలి. చిన్నప్పుడు నేను గడిపిన క్షణాలన్నింటినీ నా పిల్లలతో మరోసారి గడపాలి.”

ఇంతకుమించి వ్యక్తిగత జీవితంలో తనకు పెద్దగా కోరికల్లేవంటున్నాడు నాగచైతన్య. రోజూ ఆనందంగా ఉండగలిగితే చాలని, అంతకుమించి జీవితానికి సక్సెస్ లేదంటాడు చైతూ. ఇక వృత్తిపరంగా చూసుకుంటే, సొంత తెలివితేటలతో ఓ స్క్రిప్ట్ ఎంచుకొని, ఆ సినిమాతో సక్సెస్ కొడితే అది నిజమైన సక్సెస్ అంటున్నాడు.

One Reply to “20వ అంతస్తులో నాగచైతన్య బైకు”

Comments are closed.