అలా ప్రేమలో పడ్డాను – నయనతార

నయనతార, విఘ్నేష్ ప్రేమకథను ఏళ్లుగా చెప్పుకుంది మీడియా. ఇద్దరూ కలిసి కనిపించినా, విదేశాలకు వెళ్లినా అది వార్త అయింది. ఇలా దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న తర్వాత, ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. Advertisement అయితే వీళ్లిద్దరి…

నయనతార, విఘ్నేష్ ప్రేమకథను ఏళ్లుగా చెప్పుకుంది మీడియా. ఇద్దరూ కలిసి కనిపించినా, విదేశాలకు వెళ్లినా అది వార్త అయింది. ఇలా దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న తర్వాత, ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.

అయితే వీళ్లిద్దరి తొలి పరిచయం ఎలా జరిగింది.. ఎప్పుడు ప్రేమలో పడ్డారనే విషయం మాత్రం ఇంకా సస్పెన్సే. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది. విఘ్నేష్ తో ప్రేమలో పడిన మూమెంట్ ను నయనతార బయటపెట్టింది.

“పాండిచ్చేరి రోడ్లపై షూట్ చేస్తున్నాం. విజయ్ సేతుపతికి, విక్కీ (విఘ్నేష్ శివన్) ఏదో షాట్ గురించి వివరిస్తున్నాడు. నేను నా షాట్ కోసం వెయిట్ చేస్తూ రోడ్డు పక్కన కూర్చున్నాను. ఏమైందో ఏమో తెలీదు, సడెన్ గా నేను ఓసారి విక్కీని చూశాను. ఇంకా చెప్పాలంటే కాస్త భిన్నంగా చూశాను. విక్కీ క్యూట్ గా ఉన్నాడనిపించింది. అతడి యాటిట్యూడ్, దర్శకుడిగా అతడు వ్యవహరిస్తున్న తీరు నచ్చింది.”

ఆ క్షణమే విఘ్నేష్ తో ప్రేమలో పడ్డానని తెలిపింది నయనతార. ప్రేమ విషయంలో నయనతారే ముందుగా చొరవ తీసుకుందంట. సినిమాల్ని పక్కనపెట్టి, కాస్త కొత్తగా ఏదైనా మాట్లాడుకోవచ్చనే ఫీలింగ్ ను విఘ్నేష్ కు కలిగేలా చేసిందంట. అలా తామిద్దరి మధ్య ఓ కొత్త వేవ్ పుట్టుకొచ్చిందని తెలిపింది.

అటు విఘ్నేష్ కూడా ప్రేమలో పడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజు, నయనతార సెట్స్ నుంచి వెళ్లిపోతుందని తెలిసి చాలా బాధపడ్డానన్నాడు. ఓ అందమైన అమ్మాయి మిస్సయితే ఏ అబ్బాయికైనా బాధగానే ఉంటుందని, తనకు కూడా అలానే అనిపించిందని అన్నాడు.

అయితే చివరి రోజు షూటింగ్ లో నయనతార మాట్లాడిన విధానం కాస్త భిన్నంగా, కొత్తగా అనిపించిందని, తనతో ఆమె కొత్తగా మాట్లాడిందని, ఆ క్షణం నుంచే తనలో ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే.

6 Replies to “అలా ప్రేమలో పడ్డాను – నయనతార”

Comments are closed.