ఆంధ్ర ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో కాస్త హడావుడి జరిగింది తప్ప, అంతకు మించి మరేమీ లేదు. దేని గురించీ అంటే సమంత ఫోన్ ట్యాపింగ్ గురించే.
తెలంగాణలో ట్యాపింగ్ కు గురైన ఫోన్ ల్లో సమంత ఫోన్ కూడా వుందని గ్యాసిప్స్ గుప్పుమన్నాయి. ఆ గ్యాసిప్స్ అక్కడితో ఆగలేదు. సమంత ఫోన్ ట్యాప్ కావడం, ఆమె ‘ఆంతరింగిక మాటలు’ ఎలాగో నాగ్ చైతన్య దగ్గరకు చేర్చారని కూడా వార్తలు వచ్చేసాయి. అందువల్లే వారికి విడాకులు తప్పలేదని తీర్మానాలు చేసేసారు.
ఈ సంగతి అలా వుంటే, వేరే విషయం కూడా తెలుస్తోంది. సమంత, పూనమ్ కౌర్ ఇద్దరూ చేనేత కార్మికల శ్రేయస్సు కోసం, చేనేత వస్త్రాల ప్రచారం కోసం ముందుకు వచ్చిన వారే. వీరిలో పూనమ్ కౌర్ ముందుగా ఎంటర్ అయ్యారు. కానీ తెలంగాణలో మాత్రం సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. దీని వెనుక గురూజీ త్రివిక్రమ్ మంత్రాంగం వుందని పూనమ్ కౌర్ తన సన్నిహితుల దగ్గర బాధపడుతోందట. అంతా బాగున్నపుడు తాను చెప్పిన ఐడియాలను గురూజీ గుర్తు పెట్టుకుని సమంతకు చెప్పేసారని, వాటిని వాడుకుని ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని, తెలంగాణ ప్రభుత్వ ఆశీస్సులు లభించడంలో సమంతకు గురూజీ అండదండలు వున్నాయని పూనమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొంత మంది జనాలు తనకు- పవన్ కు లింక్ పెట్టి, ప్రచారం చేసారని, కానీ వాళ్లెవరు, త్రివిక్రమ్-సమంత, కేటీఆర్ ల జోలికి వెళ్లరని, తననే పదే పదే టార్గెట్ చేస్తారని పూనమ్ వాపోతున్నట్లు తెలుస్తోంది. తాను ఇప్పుడేమీ మాట్లాడడని, ఎన్నికల తరువాత మాట్లాడతానని పూనమ్ సన్నిహితులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూనమ్ కౌర్ పలు సార్లు గురూజీ అనబడే త్రివిక్రమ్ ను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ అనేక ట్వీట్ లు వేసిన సంగతి తెలిసిందే.
కేవలం గురూజీ పూర్తిగా పవన్ ను తన గ్రిప్ లో వుంచుకున్నారని, అందువల్లే రేణు దేశాయ్ దూరం అయ్యారని, అందువల్లే తనకు కూడా అన్యాయం జరిగిందని, త్రివిక్రమ్ ఎలా ఆడిస్తే పవన్ అలా ఆడుతున్నారని పూనమ్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైకాపా జనాలకు తాను కేవలం పవన్ ను విమర్శించడం మాత్రమే కావాలని, అలా కాకుండా అన్ని విధాలా పరిణితితో రాజకీయాలు మాట్లాడడం అవసరం లేదని, అందుకే తాను మౌనంగా వున్నానని పూనమ్ అంటున్నట్లు బోగట్టా.