హీరో ప్రభాస్ గాయం నుంచి కోలుకున్నాడు. అంతేకాదు, అతడు ఆల్రెడీ తన సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. రామోజీ ఫిలింసిటీలో 4 రోజుల నుంచి ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ నడుస్తోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లోని మరిన్ని డైమన్షన్స్ ను చూడబోతున్నారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా ఈమధ్య కాలంలో అతడి నుంచి మిస్సయిన కోణాలన్నీ ఇందులో కనిపించబోతున్నాయి.
సలార్, కల్కి లాంటి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాలకే పరిమితమైన ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాలో రొమాంటిక్ గా, కొన్ని చోట్ల ఎమోషనల్ గా కనిపించబోతున్నాడు. వీటితో పాటు అతడిలోని యాక్షన్ కూడా చూడబోతున్నారు.
1945 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో బ్రిటిష్ సైన్యంలోని సైనికుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ మూవీనే అయినప్పటికీ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయని.. మరీ ముఖ్యంగా ప్రభాస్, హీరోయిన్ ఇమాన్వి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా ఫ్రెష్ గా ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు.
ఈ సినిమా కోసం ఇప్పటికే ఫిలింసిటీలో భారీ సెట్స్ వేశారు. మిధున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల కిందట నానికి చెప్పిన మిలట్రీ బ్యాక్ డ్రాప్ స్టోరీకి, ప్రబాస్ తో చేస్తున్న సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఈ దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఏడాదిపాటు కూర్చొని ఈ కథ రాసుకున్నట్టు వెల్లడించాడు.