మండే టెస్ట్ పాస్ అయిన పుష్ప 2

పుష్ప 2 సినిమా తొలి మండే ఓకే అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది.

నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ తరువాత ఫస్ట్ మండే పుష్ప2 ఎలా వుంటుంది? కలెక్షన్లు మరీ దారుణంగా డ్రాప్ అవుతాయా? లేక నిలబడతాయా? ఈ అనుమానంతో టెన్షన్ పడ్డారు బయ్యర్లు. ఎందుకంటే ఈ మండే టెస్ట్ పాస్ అయితేనే రికవరీ ఎలా వుంటుంది అన్నది ఓ అంచనాకు అందుతుంది. అందుకే అలా టెన్షన్ పడ్డారు. ఇప్పటికే కలెక్షన్లు తక్కువ వున్న ప్రాంతాల్లో పూర్తిగా కాదు కానీ, కొంత మేరకు టికెట్ రేట్లు తగ్గించారు. వైజాగ్ లాంటి ఏరియాల్లో తగ్గించలేదు.

అయితే పుష్ప 2 సినిమా తొలి మండే ఓకే అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది. మార్నింగ్ షో లు అంత గొప్పగా కలెక్షన్లు లేవు కానీ మాట్నీ, ఫస్ట్ షో లు బాగున్నాయి. నలభై నుంచి యాభై శాతం సగటు కలెక్షన్లు కనిపించాయి. అందువల్ల మండే టెస్ట్ పాస్ అయినట్లే అనుకోవాలి. శుక్రవారం వరకు ఇలాగే నలభై, యాభై శాతంలో రన్ అయితే వీకెండ్ మీద కాస్త భరోసా వుంటుంది.

వచ్చే మండే నుంచి అన్ని చోట్లా నార్మల్ రేట్లు వుంటాయి. అప్పుడు సినిమాను షేరింగ్ మీద ఆడతారు కనుక కాస్త నెంబర్లు ఫరవాలేదు అన్నట్లు వుంటాయి. ఈ వారంతో అంటే మూడో వారంతో దాదాపుగా పుష్ప రన్ పూర్తి కావచ్చు.

ప్రస్తుతానికి ఏపీ, నైజాం బయ్యర్లకు యాభై శాతం మేరకు రికవరీ వచ్చింది. మిగిలిన యాభై శాతంలో 18 శాతం జిఎస్టీ వుంటుంది కనుక ముఫై రెండు శాతం రికవరీ రావాల్సి వుంది. ఈ రెండు వారాల్లో దగ్గరకు వెళ్లిపోతామనే ధీమా వుంది. సీడెడ్ లాంటి చోట్ల కమిషన్ కూడా రావచ్చు.

18 Replies to “మండే టెస్ట్ పాస్ అయిన పుష్ప 2”

  1. సోమవారం పాస్ .. మంగళవారం, బుధవారం ఫస్ట్ క్లాస్ .. వీకెండ్ స్టేట్ ర్యాంక్…

    ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి, ఇండియా మొత్తం చూసి అప్పుడు రాయండి ఆర్టికల్స్

    ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, అందులో బుక్ మై షో ఆప్ ఉంది..

  2. సోమవారం పాస్, మంగళ బుధ వారాలు ఫస్ట్ క్లాస్ .. వీకెండ్ స్టేట్ ర్యాంక్ … అంతేనా..

    ఒక్కసారి బుక్ మై షో ఆప్ ఓపెన్ చేసి, ఇండియా మొత్తం థియేటర్లు పరిస్థితి చూసి ఆర్టికల్స్ రాయండి

    ఈరోజు ఏ షో కి 20% కూడా ఆక్యుపెన్సీ లేదు… ఈ మెసేజ్ కూడా డిలీట్ చేసేయండి,,😁😁

Comments are closed.