రాజకీయాల్లోకి వెళ్తా-బన్నీవాస్

రాజకీయాల్లోకి వెళ్లడం తన టార్గెట్ అని, అయితే అది 2024లోనా, 2029లోనా అన్నది ఇంకా తెలియదని నిర్మాత బన్నీవాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మాత్రం 2024లోనే రెడీ అని లేదంటే మాత్రం 2029లో…

రాజకీయాల్లోకి వెళ్లడం తన టార్గెట్ అని, అయితే అది 2024లోనా, 2029లోనా అన్నది ఇంకా తెలియదని నిర్మాత బన్నీవాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మాత్రం 2024లోనే రెడీ అని లేదంటే మాత్రం 2029లో రాజకీయాల్లోకి వెళ్తానని ఆయన గ్రేట్ ఆంధ్ర కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. 

కోటబొమ్మాళి సినిమా విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎటువంటి పొలిటికల్ విమర్శలు వుండవని, అయితే సరదాగా కొన్ని చమక్కులు మాత్రం వుంటాయని, అవన్నీ తాను గతంలో ఎన్నికల వ్యవహారాలు చూసినపుడు కలిగిన అనుభవాల్లోంచి పుట్టినవే అని అన్నారు.

కోటబొమ్మాళి సినిమా మాతృక నుంచి కేవలం బేసిక్ పాయింట్ మాత్రమే తీసుకుని మొత్తం మార్చామని, బహుశా ఒరిజినల్ నచ్చిన వారికి ఇది నచ్చకపోయే ప్రమాదం వుందని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. కోటబొమ్మాళి సినిమా వేగంగా సాగుతూ మాంచి థ్రిల్లర్ గా వుంటుందన్నారు. మధ్య మధ్యలో ఫన్ వుంటుందన్నారు.

నాగ్ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మంచి చిత్రం అవుతుందని వెల్లడించారు. బోయపాటి కథ కనుక రెడీ అయితే బన్నీతో సినిమా వుంటుందన్నారు. త్రివిక్రమ్-బన్నీ సినిమా ప్రీ పొడక్షన్ వర్క్ కే ఏడాదిన్నర సమయం పడుతుందన్నారు. ఇది సోషియో ఫాంటసీతో కూడిన భారీ చిత్రమని బన్నీ వాస్ వెల్లడించారు.

ప్రస్తుతం నాన్ థియేటర్ రైట్స్ విషయంలో టాలీవుడ్ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కరోనా ముందు పరిస్థితులు వేరు, కరోనా తరువాత పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని బన్నీ వాస్ అన్నారు. ఇప్పుడు కంటెంట్ క్వాలిటీ మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. చిన్న, మీడియం సినిమాలకు సెకెండ్ షో తరవాత జనాలు వస్తున్నారని అలా రాకుంటే సినిమా ఇక ముందుకు వెళ్లదని అర్థం అయిపోతోందని అన్నారు.

హిట్ లేదా అట్టర్ ఫ్లాప్ సినిమాలకు రివ్యూలతో పని లేదని, కానీ యావరేజ్ సినిమాలకు మాత్రం రివ్యూలు హెల్ప్ అవుతుందని, అదే కనుక ముందుగా వేసేస్తే సమస్య అవుతుందని వివరించారు. పారితోషికాల విషయంలో భిన్నాభిప్రాయాలు వున్నాయని, పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చిన నిర్మాత నలభై యాభై కోట్లలో సినిమా తీయకుండా మరింత ఖర్చు పెంచుకుంటే అతనిదే తప్పు అని అన్నారు.