వివాదరహితుడిపై భారీ ఆరోపణలు

రాజమౌళి వల్ల తను త్యాగం చేశానని, అయితే తన త్యాగానికి విలువ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు శ్రీనివాసరావు.

ఎస్ఎస్ రాజమౌళి.. ఆయన మాట్లాడరు. ఆయన సినిమాలే మాట్లాడతాయి. దేశం మొత్తం ఆయన సినిమాల్ని మెచ్చుకుంటుంది. అయితే అక్కడితో ఆగిపోలేదు. రాజమౌళి వ్యక్తిత్వంపై కూడా ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది వివాదరహితుల్లో రాజమౌళి ఒకరనే ఇమేజ్ ఉంది. ఇప్పుడు అలాంటి వ్యక్తిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మామూలు ఆరోపణలు కావు, తీవ్రమైన ఆరోపణలు.

రాజమౌళిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి. రాజమౌళి తీసిన యమదొంగ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన, రాజమౌళితో తనది 35 ఏళ్ల “స్నేహ బంధం” అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రాజమౌళి కారణంగా తను చనిపోతున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు.

“ఇండియా నంబర్ వన్ డైరక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. దానికి సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం ఇది. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడా అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ కోసం చేయాలనుకునేవాడు చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను.”

రాజమౌళి, తను 1990 నుంచి స్నేహితులమని.. ఒక అమ్మాయి వల్ల విడిపోయామని అంటున్నారు శ్రీనివాసరావు. ఆర్య-2 సినిమా టైపులో తమది ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని, రాజమౌళి వల్ల తను అన్నీ కోల్పోయానని ఆరోపిస్తున్నారు.

“మాది 34 సంవత్సరాల స్నేహం. ఓ అమ్మాయి వల్ల ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. మా జీవితాల్లోకి కూడా ఓ అమ్మాయి వచ్చింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. మాది ట్రయింగిల్ లవ్ స్టోరీ. ముగ్గురుం క్లోజ్ గా ఉండడం వల్ల ఏం చేద్దామని రాజమౌళిని అడిగాను. నన్ను త్యాగం చేయమన్నాడు. కుదరదన్నాను. ముగ్గురం కలిసి ఉందామన్నాను. దారుణంగా ఉంటుంది వద్దన్నాడు. నేను పెళ్లి చేసుకుంటా నలుగురం కలిసి ఉందామన్నాను. సమాజం ఒప్పుకోదన్నాడు.”

గతంలో జరిగిన విషయాల్ని తను చెబుతాననే అనుమానంతో రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

ఇక తను ఈ నరకాన్ని భరించలేనని, చనిపోతున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. తన కేసును సుమోటాగా తీసుకొని, రాజమౌళికి లై-డిటెక్టర్ పరీక్ష చేయాలని ఆయన వీడియోలో కోరారు.

22 Replies to “వివాదరహితుడిపై భారీ ఆరోపణలు”

  1. ఎలాగూ 55 years ఒంటరిగా బతికేశారు ఇంకో 5 బతికేస్తే సరిపోతుంది.. ఇంకా ఎందుకు చచ్చిపోవడం

  2. Rajamouli vivada rahithudani evadannaru. Aayana pakka indutvawadi, mariyu charitrani marcheyadaniki enthagano thahathaha laduthunnadu. Raisinglo undadam valla evaru athaniki edurumatladaleru. Repu oka flop vasthe antha bandaram bayatapadutdi.

    1. ఏ బండారం!! అది సమాజానికి మనకు చాలా నష్టం కలిగిస్తుంది ?

  3. ఇందులో చనిపోవడానికి ఏముంది? ఇప్పటి నీ మాటల ప్రకారం.. ఆ అమ్మాయి మీ ఇద్దరితో క్లోజ్ గా మూవ్ అయ్యింది. కానీ, చివరకు ఇద్దరూ ఆమెను చేసుకోలేదు. ఇంకెవడో చేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. ఇప్పుడు కూడా అంతగా చావాలని ఉంటే ఇప్పుడైనా ఆమెను పెళ్లి చేసుకో! నీ కోరిక ఆమే తీరుస్తుంది.

  4. రాజమౌళి నెక్స్ట్ మూవీ లో వీడికి విలన్ రోల్ ఇచ్చి దున్నపోతులతో కుమ్మిస్తాడు గ్యారంటీ గా

Comments are closed.