దాంపత్యంలో ఉంటూ మరొకరి ఆలోచనలు కూడా తగవని అంటాయి సంప్రదాయాలు. అయితే మనిషికి అది అంత తేలిక కాదు. బాధ్యతలు, బంధాలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితుల్లో కూడా మనిషి పక్క చూపులు చూడకుండా ఉండటం తేలిక కాదు. మేం చూడాం, కలలో కూడా ఆలోచించం అనే వాళ్ల సంగతిని పక్కన పెడితే.. మనిషి కూడా జంతువుల నుంచి వచ్చాడు కూడా కాబట్టి.. ఎంతో కొంత జంతు ప్రవృత్తి అనేది పోయేది కాదు. వివాహం, దాంపత్యం అనేవి కాలక్రమంలో వచ్చినవే. వీటి నిర్వచనాలు, విలువలు కూడా వివిధ కాలాలకు తగ్గట్టుగా మారాయి. ప్రస్తుతం ఉన్న ప్రకారం చూస్తే.. అక్రమ సంబంధం అనేది మోసంలాంటిది. ఈ కారణం చేత విడాకులు కూడా పొందవచ్చు.
అయితే మరి నిజంగానే మనిషి అంత స్ట్రిక్ట్ గా ఉంటున్నాడా అంటే.. అబ్బే అనుకోవాల్సి వస్తుంది! ఈ విషయంలో ఇప్పుడు వినిపించే మరో పదం మైక్రో చీటింగ్. అంటే దీన్ని బట్టి.. చీటింగ్ లో చిన్న స్థాయిది అనుకోవాలి! ఇదెలా జరుగుతుంది అంటే.. పార్ట్ నర్ పక్కన లేనప్పుడు మరొకరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు, ఆలోచనలు అన్నీ మైక్రోచీటింగ్ కిందకే వస్తాయిన అంటున్నాయి నిర్వచనాలు.
లైంగిక ఆసక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మరొకరు ఎవరికైనా ఫ్లర్టింగ్ టెక్ట్స్ లు పంపడం మైక్రో చీటింగ్ కిందకే వస్తుంది. వారితో స్నేహం కొద్దీ పెట్టాము, వారు నిజంగా బాగున్నారనే విషయాన్ని చెప్పాము, వారి టాలెంట్ ను మెచ్చుకున్నాము, వారిని జస్ట్ అభినందించాము, లేదా వారి ఆలోచనలు బాగున్నాయి కాబట్టి టెక్ట్స్ చేశాము, వారి ఆలోచనలతో నాకు సాపత్యం ఉంది కాబట్టి.. అంటూ ఇలా ఎన్ని చెప్పినా.. ఇలాంటి ఫ్లర్టింగ్ టెక్ట్స్ లు కచ్చితంగా మైక్రో చీటింగ్ కిందకే వస్తాయి.
ఇంట్లో ఎంత సేపు ఉంటారో దాదాపు అంతే సేపు ఆఫీసుల్లో గడిపే రోజులు ఇవి. అలాంటి చోట లైంగికార్షణలకు కూడా చాలా ఆస్కారం ఉంది. వివాహం తర్వాత మరొకరి వైపు కళ్లు తచ్చాడినా అది కూడా మైక్రో చీటింగ్ కిందకే వస్తుంది. చూడటంతో మొదలుపెట్టడం అంటే.. అవకాశం ఉంటే ఒక్కో మెట్టు ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉన్నట్టే. కాబట్టి.. అది కూడా మైక్రో చీటింగ్ కిందే వస్తుంది.
మరొకరి అందాలను వర్ణించడం, వారితో అతి చనువును ప్రదర్శించడం, స్నేహం ముసుగులో దగ్గరవ్వడం ఇవన్నీ మైక్రో చీటింగ్ కిందకు వచ్చేవే. అబ్బే తాము అలాంటి వాళ్లం కాదని చెప్పినా.. అన్నీ ఉత్తుత్తి మాటలే అనుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇన్ స్టాలో మనకు నచ్చిన రీల్స్ మనకు బాగా నచ్చిన వారికి షేర్ చేసే పద్ధతి ఒకటి బాగా సాగుతూ ఉంటుంది. మీ మనసుకు బాగా నచ్చిన వాటిని తరచూ, అంటే రోజూ.. నిత్యం.. అపోజిట్ సెక్స్ లో ఒకరికి షేర్ చేస్తూ ఉండటం కూడా.. ఒక రకమైన ఆకర్షణే అని, అది కూడా మైక్రోచీటింగ్ కిందకే వస్తుందని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ చెబుతూ ఉంటారు!
మరి ఇలా అయితే ఏదో ఒక స్థాయిలో మైక్రోచీటింగ్ చేయమని మనిషి ఉండడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్ట్ నర్ ను గమనిస్తే ఏం చేయాలనేది మరో ప్రశ్న! దీనికి చేసేదేం లేదు.. కూర్చుని మాట్లాడుకోవడమే పరిష్కారం అని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ నయాతరానికి సూచిస్తూ ఉన్నారు!
Direct ga English articles ni base cheskuni articles rayakandi
aa relationship expert inkaa ekkkuva cheat chesthu untaaru partner ni..macro cheating.
Iddari madhya etuvanti daaparikam / secrets lekunda undi. Okari gurinchi okaru artham chesukuni accept chesukunte pakka valla gurinchi asalu alochane raadu. Idi naa 10 years marriage life lo artham ayanadi.
in the front is crocodile festival. (mundundi mosalla pandaga)
బురిడీ శిరిడీ ni నమ్మకండి ఆడు జి…హాదీ afghan దొంగ….god… du మాంసం తినేటోడు అసలు పేరు chandmia తండ్రి saifuddeen తల్లి వే… శ్య
ఏ జంతువుకి వచ్చిన ఆలోచనో