ఈ ఏడాది ఇటు సౌత్ లో, అటు నార్త్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు-తమిళ భాషల్లో ఆమె నటించిన భారతీయుడు-2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. తమిళ్ లో వచ్చిన అయలాన్ సినిమా ఆమె కెరీర్ కు పెద్దగా కలిసిరాలేదు.
ఇలా 2024లో 2 సినిమాలకే పరిమితమైంది రకుల్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రెండూ ఈ ఏడాది రావాల్సిన సినిమాలు కావు. అయలాన్ సినిమా 2023 దీపావళికే రావాలి, వాయిదా పడుతూ, ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చింది. ఇక భారతీయుడు-2 సినిమా కూడా అంతే. గతేడాది రావాల్సిన ఆ మూవీ, ఈ ఏడాది రిలీజైంది.
కొత్త ఏడాది మాత్రం అలా ఉండదంటోంది రకుల్. సౌత్ లో, నార్త్ లో మంచి ప్రాజెక్టులతో అలరిస్తానని చెబుతోంది. న్యూ ఇయర్ లో హిందీలో రకుల్ నుంచి దేదే ప్యార్ దే 2, మేరీ హస్బెండ్ కీ బీవీ, అమీరీ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో తన పాత్రలన్నీ కొత్తగా ఉంటాయని చెబుతోంది.
ఇటు సౌత్ లో ఆమె నటించిన భారతీయుడు-3 సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, థియేటర్లలోకే వస్తుందని తాజాగా దర్శకుడు శంకర్ స్పష్టతనిచ్చాడు.
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు భర్త జాకీ భగ్నానీతో కలిసి లండన్ వెళ్లింది రకుల్. అక్కడే ఆమె తన పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి రకుల్ జరుపుకుంటున్న తొలి నూతన సంవత్సర వేడుక ఇదే.
Yekkada ktr farm house lonaaa😁😁😁😂😂😂
హహ హ