ఈ హీరో జీవితానికి సంబంధించి చాలా గాసిప్స్ ఉన్నాయి. అతడిపై ఎప్పటికప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తుంటాయి. అయితే తొలిసారిగా తన రియల్ లైఫ్ ప్రేమకథను బయటపెట్టాడు సాయిధరమ్ తేజ్. తన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందంటున్నాడు.
“నా జీవితంలో కూడా లవ్ స్టోరీ ఉంది. ఓ అమ్మాయిని ప్రేమించాను. నా కాలేజ్ ఫ్రెండ్ ఆమె. ఇండస్ట్రీతో ఆమెకు సంబంధం లేదు. కెరీర్ లో ఇంకా సెటిల్ అవ్వని టైమ్ లో బ్రేకప్ అయింది. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. నా కాలేజ్ లైఫ్ తర్వాత ఫిలిం కెరీర్ స్టార్ట్ చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఈ గ్యాప్ లో మేం విడిపోయాం. అప్పటికి నా మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు.”
ఇలా తన నిజజీవిత ప్రేమకథను బయటపెట్టాడు సాయిధరమ్ తేజ్. ఇక పుకార్ల విషయానికొస్తే, హీరోయిన్లతో క్లోజ్ గా ఉండడం తన నైజమని, పుకార్లు రావడం సహజమని అంటున్నాడు. ప్రస్తుతానికి తను సింగిల్ గా ఉన్నానని, ఆ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
“నా హీరోయిన్లతో నేను చాలా క్లోజ్ గా ఉంటాను. కేవలం వాళ్లు నా హీరోయిన్స్ అని కాదు, నాకు మంచి ఫ్రెండ్స్ కూడా. నేను, రాశి, రెజీనా, రకుల్ మేమంతా చాలా క్లోజ్. అది చూసి మా మధ్య ఏదో ఉందని చాలామంది అనుకున్నారు. దీనికితోడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేశామంటే ఈ పుకారు ఇంకా పెద్దదైపోతుంది. నన్ను సింగిల్ గా మాత్రం ఉండనివ్వట్లేదు ఈ జనాలు.”
తన పెళ్లికి సంబంధించి ఇంట్లో చర్చలు జరుగుతున్నాయని స్పష్టంచేసిన సాయి ధరమ్ తేజ్… తనింకా కెరీర్ లో సెటిల్ అవ్వలేదనే విషయం అమ్మకు తెలుసంటున్నాడు. కెరీర్ లో నిలదొక్కుకున్న వెంటనే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు.