Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ హీరోయిన్ కు ఎట్టకేలకు మరో ఛాన్స్

ఆ హీరోయిన్ కు ఎట్టకేలకు మరో ఛాన్స్

స్నేహా ఉల్లాల్ గుర్తుందా.. బహుశా చాలామంది మరిచిపోయి ఉండొచ్చు. ఎందుకంటే, ఆమె ఇండస్ట్రీ నుంచి సైడ్ అయి చాలా కాలమైంది. ఇక ఇటువైపు రాదేమో అనుకున్న టైమ్ లో స్నేహా ఉల్లాల్ రీఎంట్రీ ఇచ్చింది.

అప్పుడెప్పుడో 2005లోనే కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, చేసిన కొన్ని సినిమాలకే కెరీర్ చాలించింది. ఓవైపు హిట్స్ లేక, మరోవైపు ఆరోగ్యం సహకరించక సినిమాలకు దూరమైంది. ఒకప్పుడు జూనియర్ ఐశ్వర్యరాయ్ అనిపించుకున్న స్నేహా ఉల్లాల్.. తీవ్రమైన నడుము నొప్పితో సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

2014లో చేసిన ఓ చిన్న సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరో చిన్న సినిమాతో థియేటర్లలోకి రాబోతోంది.

సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్ లాంటి కమెడియన్స్ అంతా కలిసి భవనమ్ అనే సినిమా చేశారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ ఉంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో స్నేహా ఉల్లాల్ చేసిన ఓ సాంగ్ ను కూడా చూపించారు.

అయితే టీజర్ చూస్తుంటే, సినిమాకు స్నేహా ఉల్లాల్ కు సంబంధం ఉన్నట్టు కనిపించడం లేదు. ఓ స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే ఆమెను తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏదైతేనేం, మొత్తానికి ఈ సినిమాతో స్నేహా ఉల్లాల్ మరోసారి తెలుగుతెరపైకి రాబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?