సినిమాకు ఎవరైనా క్యాచీ టైటిల్ పెట్టాలనుకుంటారు. అలాంటిది నాగశౌర్య సినిమాకు కృష్ణ..వ్రింద..విహారి అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
టైటిల్ క్లాస్ గా బాగుంది అనిపించవచ్చు. కానీ చెప్పడానికి కాస్త లెంగ్తీగా, ట్విస్టీగా వుంది కదా? పైగా బృంద అన్నదే మన పలుకుబడి.
మనం బెంగాలీలం కాదు కదా? వృంద అనడానికి బృందావనం అనే సినిమా తీసారు కానీ వృందావనం అని కాదు కదా? గమ్మత్తేమిటంటే కృష్ణ అని రాసి వ్రింద అని రాయడం.
క్రిష్ణ అని రాసి వుంటే వ్రింద అని రాయొచ్చు. కృష్ణ అని రాసాక వ్రింద ఏమిటో? వృంద అంటే విష్ణు భక్తురాలు. తులసి అనే అర్థం కూడా. నాగశౌర్య స్వంత బ్యానర్ మీద ఉష మాల్పూరి నిర్మించే ఈ సినిమాకు దర్శకుడు అనీష్ కృష్ణ