ఇప్పుడు ఇదే లేటెస్ట్ డిస్కషన్!

రెండు సినిమాలు కలిపి విక్రయించారా? లేక విడివిడిగా విక్రయించారా?

టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ సర్కిళ్లలో లేటెస్ట్ డిస్కషన్ ఒకటి నడుస్తోంది. అది సంక్రాంతికి వస్తున్నాం.. గేమ్ ఛేంజర్ సినిమాల గురించి. ఈ రెండు సినిమాలు ఏపీ, సీడెడ్‌ల‌లో పంపిణీకి ఇచ్చింది ఒకే నిర్మాత.. దిల్ రాజు. ఏపీలో 80 కోట్ల మేరకు, సీడెడ్ 28 కోట్ల మేరకు ఇచ్చారు.

ఇక్కడ ఏది ఎంత అంటే ఏపీలో గేమ్ ఛేంజర్ 65 కోట్లు.. సంక్రాంతికి వస్తున్నాం 15 కోట్లు. సీడెడ్ లో గేమ్ ఛేంజర్ 22 కోట్లు.. సంక్రాంతికి వస్తున్నాం 6 కోట్లు. ఇవీ సర్క్యులేషన్‌లో వున్న లెక్కలు.

ఇప్పుడు ఇంతకీ డిస్కషన్ ఏమిటంటే, ఈ రెండు సినిమాలు కలిపి విక్రయించారా? లేక విడివిడిగా విక్రయించారా? అన్నది. తమకు కలిపే విక్రయించారు అనే కాన్ఫిడెన్స్‌లో వున్నారు ఆ సినిమాల బయ్యర్లు అంతా. కలిపి విక్రయించలేదు దేనికదే అని నిర్మాతలు శిరీష్/దిల్ రాజు అన్నారనే గ్యాసిప్ ఒకటి వినిపించడం మొదలైంది. అప్పటి నుంచి ఈ డిస్కషన్ ప్రారంభమైంది.

రెండూ కలిపి విక్రయించినట్లు అయితే టోటల్ బయ్యర్లు అంతా డబుల్ హ్యాపీ. ఎందుకంటే గేమ్ ఛేంజర్‌లో సగానికి సగం నష్టపోయారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకటికి అయిదింతలు ఆదాయం వచ్చింది. రెండూ కలిపి చూసుకుంటే బయ్యర్లు హ్యాపీ, నిర్మాతకు హ్యాపీ.

అంత వరకు ఓకె. విడివిడిగా లెక్కలు అప్పచెప్పాలి అంటే మాత్రం బయ్యర్లు కిందపడిపోతారు. గేమ్ ఛేంజర్‌కు సగానికి సగం నష్టపోతారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కమిషన్లు మాత్రం దక్కుతాయి. అంటే ఏపీ, సీడెడ్ కలిపి గేమ్ ఛేంజర్ బయ్యర్లు 40 కోట్లకు పైగా నష్టపోతారు. అదే కలిపి లెక్కిస్తే అంతా హ్యాపీ.

ఇప్పుడు ఇదే ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్. విడివిడిగా లెక్కించమంటే బయ్యర్లు ఊరుకోరని, ఓవర్ ఫ్లోస్ కట్టరని కొందరి కామెంట్. బయ్యర్లు మాత్రం తమకు కలిపే ఇచ్చారని, అసలు అందులో డిస్కషన్ నే లేదని అంటున్నారు.

3 Replies to “ఇప్పుడు ఇదే లేటెస్ట్ డిస్కషన్!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.