జీబ్రా.. ఇంట్రస్టింగ్ ఫన్ థ్రిల్లర్

సత్యదేవ్ మంచి నటుడు, కానీ సరైన బ్రేక్ రావడం లేదు. మంచి నటుడు అని అందరూ అంటారు. సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ సరైన హిట్ పడడం లేదు. ఇప్పుడు మరో సినిమా గ్లింప్స్…

సత్యదేవ్ మంచి నటుడు, కానీ సరైన బ్రేక్ రావడం లేదు. మంచి నటుడు అని అందరూ అంటారు. సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ సరైన హిట్ పడడం లేదు. ఇప్పుడు మరో సినిమా గ్లింప్స్ వచ్చింది సత్యదేవ్ నుంచి.

జీబ్రా అనే టైటిల్ ఏమిటన్నది సినిమా చూస్తే కానీ తెలియకపోవచ్చు. గ్లింప్స్ మాత్రం థ్రిల్లర్ ప్లస్ ఎంటర్ టైనర్ అని చెబుతోంది. సినిమాలో పెద్ద పాడింగ్ నే వున్నట్లు తెలుస్తోంది. హీరో సత్య తో పాటు విలన్ గా డాలీ ధనుంజయా‌ వున్నారు. సత్యరాజ్, కమెడియన్లు సునీల్, సత్య వున్నారు. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్.

ఒక పక్క థ్రిల్లర్ అనిపించే సీన్లు గ్లింప్స్ లో వేస్తూనే, అదే టైమ్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ కలర్ ను కూడా గ్లింప్స్ కు ఇచ్చే ప్రయత్నం చేసారు. గ్లింప్స్ కట్ బాగుంది.

ఒక్కో పాత్రను పరిచయం చేసి సినిమా మీద ఇంట్రస్ట్ పెంచే ప్రయత్నం చేసాడు దర్శకుడు ఈశ్వర్ కార్తీక్. రవి బసూర్ నేఫథ్య సంగీతం ఒక్క గ్లింప్స్ లో బాగానే వుంది. అద్భుతాల కోసం ట్రయిలర్ వరకు అగాలి.

సినిమా కు ఎన్ని స్టార్లు వస్తాయో అన్నది ఇప్పటికి తెలియదు కానీ, సినిమాలో పాస్ వర్డ్ గా ఫైవ్ స్టార్స్ డైలాగ్ ఫన్ బాగుంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ‌ పిల్మ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

2 Replies to “జీబ్రా.. ఇంట్రస్టింగ్ ఫన్ థ్రిల్లర్”

Comments are closed.