ఢిల్లీలో బీజేపీ పాగా.. టీడీపీకి పొంచిన ప్ర‌మాదం!

రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. మ‌రీ ముఖ్యంగా బీజేపీ ప్ర‌తి విజ‌యం, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాల‌కు గండం అని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.

ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ల ఏళ్ల నిరీక్ష‌ణ ఎట్ట‌కేల‌కు తీరింది. ఆప్‌ను గ‌ద్దె దించి, ఢిల్లీ పీఠంపై కూచోడానికి బీజేపీకి దేశ రాజ‌ధాని ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌టికే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి అధికారంలో వుంది. పూర్వ‌కాలంలో రాజులు ఒక్కో రాజ్యాన్ని జ‌యిస్తూ వెళ్లేవాళ్లు. రాజ్య‌కాంక్ష అనేది త‌నివితీర‌నిది. విస్త‌రించే కొద్ది పెరిగేది రాజ్య‌కాంక్ష మాత్ర‌మే. రాజులు, రాజ్యాలు పోయి, ప్ర‌జాస్వామ్యం వ‌చ్చినా, అధికార కాంక్ష రూపంలో రాజ్య‌కాంక్ష రూపం మార్చుకుంది.

దేశ వ్యాప్తంగా బీజేపీ విస్త‌రించేందుకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. ఇందులో భాగంగానే జ‌మిలి ఎన్నిక‌ల జ‌పాన్ని కొంత‌కాలంగా బీజేపీ చేస్తోంది. రాజ‌కీయ పార్టీగా విస్త‌రించాల‌నే కోరిక‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు. ఆదేం నేరం కూడా కాదు. అయితే రాజ‌కీయాల్లో ఎప్పుడూ స్థిర‌త్వం వుండ‌దు. అందుకే రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రులు ఉండ‌ర‌ని అంటుంటారు.

ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా వుండాల్సింది బీజేపీ మిత్ర‌ప‌క్షాలే. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ ఆశ‌యంగా పెట్టుకుంది. ప్ర‌స్తుతానికి మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌లో బీజేపీ బ‌లంగా వుంది. ఇక ఆ పార్టీ టార్గెట్ త‌మిళ‌నాడు, రెండు తెలుగు రాష్ట్రాలు. తెలంగాణ‌లో బీజేపీ నెమ్మ‌దిగా పుంజుకుంటోంది. రానున్న ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రంలో ముక్కోణ‌పు పోటీ జ‌రిగినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రి పోరాటం చేస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే… టీడీపీ, జ‌న‌సేన‌తో బీజేపీ జ‌త క‌ట్టింది. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం బీజేపీతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్నేహం చేస్తున్నారు. అయితే రాజ‌కీయాల్లో ఇత‌ర పార్టీల అవ‌స‌రాల కోసం బీజేపీ ఎప్పుడూ త‌న‌ను తాను బ‌లిపెట్టుకోదు. అయితే వివిధ కార‌ణాల‌తో బీజేపీ చెప్పిన‌ట్టే, చంద్ర‌బాబు వినాల్సిన దుస్థితి. ముఖ్యంగా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌ను చూపి, రానున్న రోజుల్లో బీజేపీ బ‌ల‌ప‌డేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసే అవ‌కాశం వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

ఎటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ బీజేపీ ఏది చెబితే, దాన్ని పాటిస్తారు. మ‌రీ ముఖ్యంగా స‌నాత‌న ధ‌ర్మం పేరుతో హిందువులను రాజ‌కీయంగా ఏకం చేసేందుకు ప‌వ‌న్ అనే అస్త్రాన్ని ఇప్ప‌టికే బీజేపీ ప్ర‌యోగించింది. ఇదే సంద‌ర్భంలో వ‌య‌సు రీత్యా చంద్ర‌బాబునాయుడు రానున్న రోజుల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం వుండ‌దు. ప్ర‌స్తుతం అన‌ధికారికంగా పార్టీ, ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల్ని చూస్తున్న లోకేశ్‌, రానున్న రోజుల్లో అధికారికంగానే సార‌థి అవుతారు.

సీనియ‌ర్ నాయ‌కుడైన చంద్ర‌బాబు నేతృత్వం వ‌హించే వ‌ర‌కూ బీజేపీ అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌చ్చు. కానీ లోకేశ్ వార‌స‌త్వ రాజ‌కీయాల్ని బీజేపీ అంగీక‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం లేదు. ప‌వ‌న్‌ను ముందు పెట్టి, లోకేశ్‌ను వెన‌క్కి నెట్ట‌డానికి బీజేపీ ఏ మాత్రం వెనుకాడక‌పోవ‌చ్చు. ఎందుకంటే, జాతీయ స్థాయిలో త‌మ‌కంటూ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేన‌ప్పుడు, ఏ పార్టీనైనా క‌బ‌ళించ‌డానికి బీజేపీ ముందూవెనుకా ఆలోచించ‌క‌పోవ‌చ్చు.

మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వానికి క్షేత్ర‌స్థాయిలో పెద్ద‌గా సానుకూల‌త లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ, జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధుల్లో మెజార్టీ నేత‌ల విచ్చ‌ల‌విడిత‌నం పెరిగిపోయింద‌న్న వార్త‌లు ప్ర‌భుత్వ అనుకూల మీడియాలోనే వ‌స్తున్నాయి. దీంతో నాయ‌కత్వ మారిస్తే త‌ప్ప‌, జ‌గ‌న్‌ను అడ్డుకోవ‌డం సాధ్యం కాద‌నే అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చేందుకు బీజేపీ రానున్న రోజుల్లో ప‌థ‌క ర‌చ‌న చేయొచ్చు. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. మ‌రీ ముఖ్యంగా బీజేపీ ప్ర‌తి విజ‌యం, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాల‌కు గండం అని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.

47 Replies to “ఢిల్లీలో బీజేపీ పాగా.. టీడీపీకి పొంచిన ప్ర‌మాదం!”

  1. లవ..డా ఏమన్నా కాదా!జగన్ గాడు బలమైన ప్రత్యర్థి నా..టీడీపీ కి పొంచి వున్న ప్రమాదమా…కికికి….చెత్త కాగితం మీద పిచ్చి రాతలు..ఇక్కడ ఈ ఆర్టికల్స్ ఎం తేడా లేదు.

  2. హ! హ!!

    జగన్ పై దాడి శ్రుతిమించితె.. అన్న నీ ఆర్టికల్ లొ… జగన్ పై దాడి చెస్తె TDP కె నష్టం అని నువ్వు రాసె.. అందుకు వెటకారంగా EJAY ఇలా రాసాడు

    ..

    ఢిల్లీ లో బీజేపీ విజయం..

    వైసీపీ కి ఫుల్లుగా లాభం..

    టీడీపీ కి భారీ నష్టం..

    ..

    అని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ఆర్టికల్ కోసం..వెయిటింగ్..

    1. హ! హ!! నువ్వు నిజం గా అలా రాశవా? నీ బతుకు అందరికీ అర్ధం అయొపొతుంది రా!

    2. ఔను, నేను చూసాను ఆ కా మెంట్ ఇందాక. ఇపుడు డిలీట్ చేసినట్టున్నాడు వీడు.

  3. ప్రమాదం ఏముంది, ఒకసారి గెలిచాక 5 సంవత్సరాల వరకు ప్రభుత్వానికి సమయం ఉంది, అది కూడా 130 కి పైగా సీట్లతో గెలిచిన పార్టీ కదా, బీజేపీ ఉన్నా లేకపోయినా టీడీపీ కి వచ్చే ప్రమాదం ఏముంది, 5 సంవత్సరాల తర్వాత రాజు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ప్రమాదం ఉంటుందో నాకు అర్థం కాలేదు

  4. ప్రపంచంలొ ఎది జరిగినా అది TDP కి నష్టం అని… YCP కి లాభం అన్నట్టు రాయటం కి అలవాటె!

    .

    ముందు చెల్లెలు TV లు ఎక్కి పిచ్చ పిచ్చగా Jagan ని తిడుతుంది. ముందు అది చూడు !

    దీని వళ్ళ కూడా TDP కె నష్టం అని సరిపెడతావా! సరె కాని!

  5. ప్రపంచంలొ ఎది జరిగినా అది TDP కి నష్టం అని… Y.-.C.-.P కి లాభం అన్నట్టు రాయటం కి అలవాటె!

    ..

    ముందు చెల్లెలు TV లు ఎక్కి పిచ్చ పిచ్చగా Jagan ని తిడుతుంది. ముందు అది చూడు !

    దీని వళ్ళ కూడా TDP కె నష్టం అని సరిపెడతావా! సరె కాని!

  6. హమ్మయ్య.. వచ్చేసింది.. పులిహోర ఆర్టికల్..

    పొద్దున్న ఎదో వెటకారం గా నేను రాస్తే.. సాయంత్రం తిరిగేసరికి.. అది నిజం చేసేసావు..

    పోనీ ఏదైనా విషయం ఉందా.. అంటే.. అదీ లేదు..

    ..

    ఆంధ్ర లో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ఫస్ట్ తెలంగాణ లో గెలవగలగాలి..

    తెలంగాణ లో బీజేపీ గెలవాలి అంటే.. కర్ణాటక లో తిరుగులేని ఆధిక్యం లో ఉండాలి.. ఇది చిన్న లాజిక్..

    ఈ విషయం ఎక్కడా నీ రాతల్లో కనపడదు..

    ..

    అసలు నీ రాతల్లో ఎక్కడా బుర్ర పెట్టి రాసినట్టు కనపడదు..

    ఢిల్లీ లో బీజేపీ గెలిచింది కాబట్టి.. ఆంధ్ర లో టీడీపీ ఓడిపోతుంది..

    మహారాష్ట్ర లో బీజేపీ గెలిచింది కాబట్టి.. ఆంధ్ర లో టీడీపీ ఓడిపోతుంది..

    హర్యానా లో బీజేపీ ఓడిపోయింది కాబట్టి.. ఆంధ్ర లో టీడీపీ ఓడిపోతుంది..

    ఇలా ఉంటాయి నీ పనికిమాలిన రాతలు.. అర్థం పర్థం లేకుండా ..

    ..

    ఇప్పుడు నీకు, నీ జగన్ రెడ్డి కి ఓపెన్ ఛాలెంజ్..

    నీ జగన్ రెడ్డి కి దమ్ముంటే.. ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను ..

    1. హ! హ!! మీరు చెప్పినట్టె వీడు నిజంగా రాసాడు!

      అయినా జనం నవ్వుకుంటారు అని కూడా లెకుండా… ప్రపంచంలొ ఎది జరిగినా అది TDP కి నష్టం Y.-.C.-.P కి లాభం అన్నట్టు ఈమద్య తెగ రాస్తున్నాడు!

  7. మనుషుల్ని జైల్లో పెట్టి ఆస్తులు సీజ్ చేసి పార్టీని hijack చెయ్యటం బీజేపీకి ఈజీ కదా!!బాలమైన టీడీపీ తో ఎందుకు గోక్కోవటం
  8. ట్రంప్ గెలిచిన టీడీపీ కే ప్రమాదం, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువుగా అమెరికా లో ఉన్నారు. సీబీఎన్ వల్లే వాళ్ళు అమెరికా లో ఉన్నారు, కబ్బటి ట్రంప్ , Modi తో కలిసి 2025 లో ఎలక్షన్స్ పెట్టించి TDP ని ఓడించి 11 reddy ని 175/175 తో CM చేస్తారు. ఈ ఆర్టికల్ ఎందుకు రాయలేదు అబ్బా?

    1. రాజశేఖర్ గారు తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అందరూ ఇంజనీరింగ్ చదివి ఆమెరికా వెళ్లారు: 🐑 🐑 🐑

  9. CBN గారు has a fair share in landslide victory, Delhi voters believe in credible leaders like CBN garu!! his last minute campaign influenced 2-3% neutral voters in favor of BJP!! kudos sir!!

  10. కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల టిడిపి కి నష్టం..

    రోజా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల టిడిపి కి నష్టం..

    బొత్స, పెద్దిరెడ్డి సైలెంట్ గా ఉండటం వల్ల టిడిపి కి నష్టం..

    అంతే కదా జీఏ గారు

  11. బలమైన ప్రత్యర్థి నీ చూపించి రానున్న రోజుల్లో బిజెపి రాష్ట్రంలో బలపడటానికి చూస్తుంది విశ్లేషకులు కేఎస్ ప్రసాద్, కేఎస్ఆర్, వైఎన్ఆర్, జర్నలిస్టు సాయి

  12. అవకాశం వస్తే ఏ పార్టీ అయినా స్వంతముగా ఎదగటానికి ప్రయత్నిస్తుంది. దీనికి బీజేపీ ఏమీ మినాయింపు కాదు. బీజేపీ ముందుగా తెలంగాణా , తమిళనాడు లో ప్రయత్నం చేస్తుంది . దీనికి చంద్రబాబు అవసరం వుంది. తెలంగాణ, తమిళనాడు ఫలితాలమీద ఆధారపడి ఆంధ్రాలో బీజేపీ వ్యూహం ఉంటుంది. దానికి చాలా సమయం (2034 ) సమయం వుంది, ముందుగా వైసీపీ ని మింగేసే పనిలో వుంది బీజేపీ.

  13. దీని అర్థం ఏమిటంటే .. ఇక జన్మలో అన్న మళ్ళీ cm అయ్యే chance లేదంటావ్ .. ప్రధాన ప్రత్యర్ధి గా కూడా ఎన్నేళ్లు ఉంటాడో, శూన్యం లో ఎప్పుడు కలిసిపోతాడో కూడా క్లారిటీ గా చెప్పేయ్ .. దాని కోసం మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఎందుకూ

Comments are closed.