తండేల్ కొంప మునిగింది

తండేల్ కొంప మునిగింది. ఊహించని విధంగా ఈ సినిమా పైరసీ బారిన పడింది.

నాగచైతన్య హీరోగా తెరకెక్కింది తండేల్ సినిమా. సాయిపల్లవి హీరోయిన్. మొదటి రోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. దీంతో యూనిట్ సంబరాలు చేసుకుంది. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. ఆల్ సెట్ అనుకున్నారు.

అంతలోనే తండేల్ కొంప మునిగింది. ఊహించని విధంగా ఈ సినిమా పైరసీ బారిన పడింది. ఏ సినిమాకైనా పైరసీ అనేది ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్ గా మారింది. కానీ తండేల్ విషయంలో అంతకుమించి.

అవును.. విడుదలై 24 గంటలైనా గడవక ముందే తండేల్ మూవీ హెచ్ డీ ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆడియో, వీడియో క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంది. చూస్తుంటే, ఎవరో పనిగట్టుకొని సినిమాను పైరసీ చేసినట్టు అనిపిస్తోంది.

ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 21.27 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈరోజు బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇలాంటి టైమ్ లో బయటకొచ్చిన హెచ్ డీ ప్రింట్ సినిమా రన్ పై, వసూళ్ల పై గట్టి ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.

20 Replies to “తండేల్ కొంప మునిగింది”

    1. Anthe kaadu game changer ki oka 500crs bokka padindi anty fans valla

      Ika pushpa2 ap

      Karnataka

      Kerala tamilnadu lo flop ki Karanam mega fans ye

      Kada

      Anduke Anti fans GC ni release kakamunde HD print pettesaru daniki allu arjun NTR hand vundi antunnaru

      Ila vallalo vallu kottukoni chavadame correct

  1. C.Hall లో చూస్తేనే తుత్తి కద. కలచ్చన్లు మల్లీ పైకి ఎక్కుతై. ఉచారుగా వుండoడేహే 🤔

  2. ఈ చిత్రం ఒక మత్స్యకారుడు జీవిత పోరాటం కథ….. ఎందుకు బయ్యా HD మూవీ నేట్ లో పెడతాను…. కానీ ఒకటి ఇలాంటి యాదవ పనులు చేసిన మూవీ మాత్రం సూపర్ అందులో ఎటువంటి అనుమానం లేదు ఇది మాత్రం చెప్పగలను ❤👌

Comments are closed.